అంతర్జాతీయం

హిల్లరీకి మద్దతుగా భారతీయుల గ్రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 19: అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రాట్ల తరపున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా అమెరికన్ భారతీయులు ఒక గ్రూపును ప్రారంభించారు. హిల్లరీకి మద్దతుగా జాతీయ స్థాయిలో స్వచ్ఛంద కార్యకర్తల సంస్థగా ఇండియన్ అమెరికన్స్ ఫర్ హిల్లరీ(ఐఏఎఫ్‌హెచ్) పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. వాషింగ్టన్ డీసీ లోని మేరీలాండ్‌లో ఏప్రిల్ 24న సంస్థ లాంఛనంగా ప్రారంభమవుతుందన్నారు. అమెరికాలో జీవిస్తున్న లక్షలాది భారతీయులను ఏకతాటిపైకి తీసుకువచ్చి హిల్లరీకి అనుకూలంగా ఓటు వేయించటమే తమ సంస్థ లక్ష్యమని సంస్థ ప్రారంభించిన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మేరీలాండ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో అమెరికన్ భారతీయులను ఉద్దేశించి హిల్లరీ మాట్లాడుతుందని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ సీఓఓ నీరా టాండన్ తెలిపారు. హిల్లరీ అత్యంత సన్నిహిత స్నేహితులలో టాండన్ ఒకరు. హిల్లరీకి అమెరికాలో భారతీయ స్నేహితులు చాలామంది ఉన్నారని, ఆమె ఇప్పటికి నాలుగుసార్లు భారత్‌ను వివిధ హోదాల్లో సందర్శించారని టాండన్ అన్నారు. భారత్‌లో చాలా ప్రాంతాలను సందర్శించిన ఆమె.. మన దేశంతో అమెరికా అనుబంధాన్ని పటిష్టపరచుకోవాలని భావిస్తున్నారన్నారు. హిల్లరీ అమెరికా అధ్యక్షురాలవుతే.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని నీరా తెలిపారు.

‘9/11’నే మరిచిపోయిన ట్రంప్

న్యూయార్క్, ఏప్రిల్ 19: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీకి ఊవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ నూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన విమానదాడి ఎప్పుడు జరిగింది మరచిపోయారు. అమెరికా ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడిలో వేలాది మంది చనిపోగా, అపారమైన ఆస్తినష్టం వాటిల్లింది. 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడిని 9/11గా ప్రపంచమంతా గుర్తుంచుకుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాడి ఎప్పుడు జరిగిందో మరచిపోయారు. బుఫాలాలో ఎన్నికల ప్రచారం చేసిన ట్రంప్ ’7/11’న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య సముదాయంపై విమాన దాడి జరిగిందని అనేశారు. ఒకసారి కాదు అనేక సార్లు ఆయన 7/11 అంటూ ప్రసంగం కొనసాగించారు. దాడి జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానన్న 69 ఏళ్ల ట్రంప్ ఆ సమయంలో ఫైర్ సిబ్బంది, భద్రతాదళాలు పడ్డ కష్టం చూశానని పేర్కొన్నారు. ట్రంప్ తప్పు మాట్లాడుతున్నారని గమనించిన వ్యక్తిగత సిబ్బంది దాన్ని సరిచేయాలని, ఆయనకు చెప్పిచూసినా ఫలితం కనిపించలేదు. అనేక సార్లు 7/11 అంటూ ప్రసంగం సాగిపోయింది.