అంతర్జాతీయం

భారత్, న్యూజిలాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, ఏప్రిల్ 30: భారత్, న్యూజిలాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. భారత్ అనుసరిస్తున్న ‘లుక్ ఈస్ట్’ విధానం ఇప్పుడు ‘లుక్ యాక్ట్’గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ప్రణబ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌లో తొలిసారి మూడు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం ఆక్లాండ్ చేరుకున్న అనంతరం ప్రణబ్ మాట్లాడుతూ, భారతదేశ వ్యూహాత్మక ఆలోచనలు, ఆర్థిక కార్యకలాపాల్లో న్యూజిలాండ్ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. పసిఫిక్ ప్రాంత దేశాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యత గురించి ప్రణబ్ ఈ సందర్భంగా వివరించారు. భారతదేశ విదేశీ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ, పసిఫిక్ మహాసముద్ర మార్గాల ద్వారానే సాగుతోందని, ఈ మార్గాల ద్వారా రవాణా అవుతున్న చమురు, సహజ వాయువు, బొగ్గు తదితర ఉత్పత్తుల ద్వారా మనం పెద్దమొత్తంలో ఇంధనాన్ని సమకూర్చుకోగలుగుతున్నామని స్థానిక దినపత్రిక ‘న్యూజిలాండ్ హెరాల్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణబ్ పేర్కొన్నారు. భారత రాష్టప్రతి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన నిమిత్తం శనివారం ఉదయం ఆక్లాండ్‌కు చేరుకున్న ప్రణబ్ ముఖర్జీకి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జనరల్ హౌస్‌లో ఆయనకు న్యూజిలాండ్ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సర్ జెర్రీ మటెపారీ తన ముక్కుతో సున్నితంగా ప్రణబ్ ముక్కును రుద్ది తమ ఆచారం ప్రకారం స్వాగతం పలికారు.

ఆక్లాండ్‌లో శనివారం న్యూజిలాండ్ గవర్నర్
జనరల్ సర్ జెర్రీ మటెపారీతో సమావేశమైన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ

అమెరికా మహిళకు
వందేళ్ల జైలు!
లాస్ ఏంజిలిస్, ఏప్రిల్ 30: తల్లి గర్భంలోంచి పుట్టని శిశువును బయటకు తీసిన నేరానికి కొలరాడో కోర్టు ఓ మహిళకు వందేళ్ల జైలు శిక్ష విధించింది. డైనెల్ లేన్ అనే మహిళ మిషెల్లి వికిన్స్ అనే ఏడేళ్ల గర్భిణిపై దాడి చేసి గర్భస్థ శిశువును వెలికి తీసిందన్న ఆరోపణలు నిజం కావటంతో న్యాయస్థానం శనివారం తీర్పు చెప్పింది. గర్భిణి సమయంలో అవసరమైన దుస్తుల గురించి తాను ఇచ్చిన ఒక ప్రకటనకు లేన్ నుంచి స్పందన రావటంతో మిషెల్లి... ఆమె ఇంటికి వెళ్లింది. లేన్ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే మిషెల్లిపై కత్తితో దాడి చేసి కడుపు కోసి గర్భంలో ఉన్న శిశువు కిరాతకంగా బయటకు తీసింది. ఈ దాడిలో మిషెల్లి ప్రాణాలతో బయటపడినా.. ఆమె శిశువును కోల్పోవలసి వచ్చింది.