జాతీయ వార్తలు

ఆగని దావానలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా/ డెహ్రాడూన్, మే 1: ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న దావానలం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌ను అంటుకుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అడవులు తగుల బడటంతో వేలాది హెక్టార్లు నాశనం కావడంతో..ఆ మంటలను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇప్పటికే హిమాచల్ రాజధాని సిమ్లాలో 50వేల హెక్టార్ల అటవీ భూమి అంటుకు పోయింది. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సిమ్లా గ్రామీణ ప్రాంతాలను ఆనుకుని ఉన్న అడవులకే ఇప్పటి వరకూ పరిమితమైన మంటలు కొత్తగా మరో పనె్నండు ప్రాంతాలకు వ్యాపించినట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ మంటల్ని ఆర్పేందుకు ఆదివారం వైమానిక దళం రంగంలోకి దిగి వేలాది లీటర్ల మేర నీటిని చల్లి అగ్ని వ్యాప్తిని ఆర్పేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే తీవ్రమైన దావానలం వల్ల 2269హెక్టార్ల మేర అడవులు ధ్వంసమయ్యాయి. దాదాపు మూడువేల లీటర్ల నీటిని తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్ ద్వారా అల్‌మఖాన్, కిల్‌బారి, నలేనా ప్రాంతాల్లో మంటల్ని ఆర్పే ప్రయత్నం జరిగింది. అయితే పౌరి ప్రాంతంలలో మంటలు చాలా ఎత్తుకు రావడం వల్ల నీటిని చల్లే ప్రయత్నాలు సఫలం కాలేదు. వైమానిక దళంతో పాటు స్థానిక ప్రజలు కూడా భారీ పరిమాణంలో నీటిని సేకరించి మంటల్ని ఆర్పడంలో తోడ్పడుతున్నారు. పౌరి, నైనితాల్, రుద్రప్రయాగ ప్రాంతాలు ఈ పెను మంటల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. అనేక మంది మరణించారు. మే రెండు తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న వాతావరణ విభాగం..రెండు మూడు రోజుల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చునని భావిస్తోంది.