అంతర్జాతీయం

‘ఒబామా ఔట్!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 1: ‘ఒబామా ఔట్’.. ఈ మాట ఎవరో అన్నది కాదు.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తనపై తానే పేల్చుకున్న జోక్ ఇది. వైట్‌హౌస్‌లో ఆదివారం జరిగిన ‘బ్లాక్‌టై’ కార్యక్రమంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, జర్నలిస్టులు, తన తరువాతి అధ్యక్షపదవిని ఆశిస్తున్న హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్‌లపైనా సరదా కామెంట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, ఇతర హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా చివరి ‘బ్లాక్‌టై’ కార్యక్రమం కావటంతో పెద్దఎత్తున ప్రముఖులు హాజరయ్యారు. ఒబామా తన ప్రసంగంలో ప్రధానంగా ట్రంప్‌నే టార్గెట్ చేసుకున్నారు. ‘వాళ్లేమో డొనాల్డ్‌కి అధ్యక్షుడికి ఉండాల్సినంత విదేశాంగ విధానపు అనుభవం లేదని ఆరోపిస్తారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే మిస్ స్వీడన్, మిస్ అర్జెంటీనా, మిస్ అజెర్‌బైజాన్ వంటి వివిధ దేశాధినేతలతో సంవత్సరాలపాటు కలిశారు’ అని ఒబామా వ్యంగ్యంగా అన్నారు. ట్రంప్, పార్టీలో అతని ప్రత్యర్థులు టెడ్ క్రజ్, జాన్ కసిచ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. హిల్లరీని ప్రశంసలతో ముంచెత్తారు. ‘వచ్చే సంవత్సరం ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉండబోతున్నారు.. ఆమె ఎవరో చెప్పండి? అంటూ హిల్లరీ విజయం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టులపైనా సరదా వ్యాఖ్యలు చేస్తూ ‘ఒబామా ఔట్’ అంటూ మైక్రోఫోన్‌ను వదిలేస్తూ ప్రసంగాన్ని ముగించారు.