అంతర్జాతీయం

పోటీలో ఆ ఇద్దరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 3: అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్యే పోటీ దాదాపు ఖాయమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కీలక రాష్టమ్రైన ఇండియానా ప్రైమరీల ఓటింగ్ మంగళవారం ప్రారంభం కావడంతో వచ్చే నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే ప్రధాన అభ్యర్థులుగా డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు పోటీ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తాజా సర్వేలు అంచనా వేశాయి. కాగా, ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పోటీలో దూసుకు పోతున్న డొనాల్డ్ ట్రంప్‌ను నిలువరించడానికి ఆయన ప్రధాన ప్రత్యర్థి, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్‌కు ఇది చివరి అవకాశం కానుంది.
కాగా, ఇండియానాలో మనం గెలిస్తే క్రుజ్ పని ముగినట్లేనని, ఆ తర్వాత మనం హిల్లరీ క్లింటన్‌పై దృష్టిపెట్టవచ్చని సోమవారం తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. ఇదిలా ఉండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం 68 ఏళ్ల హిల్లరీ క్లింటన్ ఒళ్లో పడిపోవడం దాదాపు ఖాయమని, అలాగే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ దక్కించుకోవడం ఖాయమని సిఎన్‌ఎన్ తన తాజా ఒపీనియన్ పోల్‌లో తెలియజేసింది. సిఎన్‌ఎన్/ఒఆర్‌సి నిర్వహించిన ఈ తాజా సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 84 శాతం ఓటర్లు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కావడం ఖాయమని భావిస్తుండగా, 85 శాతం మంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే డెమోక్రటిక్ పార్టీ ఓటర్లలో 51 శాతం మంది హిల్లరీ క్లింటన్‌ను పార్టీ అభ్యర్థి కావాలని కోరుకుంటుండగా, రిపబ్లికన్ పార్టీ ఓటర్లలో 49 శాతం మంది ట్రంప్ తమ పార్టీ అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. కాగా, జూన్ 7న కాలిపోర్నియాలో రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి ట్రంప్‌కు పార్టీ అభ్యర్థి కావడానికి అవసరమైన 1237 మంది డెలిగేట్లకన్నా 125 మంది అంటే మొత్తం 1366 మంది డెలిగేట్లు ఉంటారని మైక్రోసాఫ్ట్ ప్రధాన సెర్చ్ ఇంజన్ బింగ్ అంచనా వేసింది. అలాగే హిల్లరీ క్లింటన్‌కు పార్టీ అభ్యర్థి కావడానికి అవసరమైన 2,383 మంది డెలిగేట్లకన్నా దాదాపు 300 మంది ఎక్కువగా అంటే 2676 మంది డెలిగేట్లు ఉంటారని తెలిపింది. కాగా, ఇండియానాలో ఆధిక్యత సాధించగలనని ట్రంప్ వ్యక్తం చేశారు.