అంతర్జాతీయం

మట్టిపెళ్లలు విరిగిపడి 35 మంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 8: చైనాలోని ఫుజియన్ ప్రావెన్స్‌లో కురిసిన భారీ వర్షాలకు మట్టిపెళ్లలు విరిగిపడటంతో 35 మంది గల్లంతుకాగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. ఫుజియన్‌లో నిర్మిస్తున్న ఒక హైడ్రో పవర్ ప్లాంట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పవర్ ప్లాంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్‌పై మట్టిపెళ్లలు పడటంతో సిబ్బందిలోని 35 మంది గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలను తీవ్రం చేశారు. ఈ ప్రావెన్స్‌లో అత్యధికంగా 191.6 మి.మీ. వర్షపాతం కురవడంతో మట్టిపెళ్లలు విరిగిపడినట్లు తెలుస్తోంది.

ఈ దుర్ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న టూరిస్ట్ స్పాట్‌లను అన్నింటినీ మూసివేశారు. అలాగే నదులు, సరస్సులలో విహార యాత్రలను నిలిపివేశారు. బాధితులకు వెంటనే సహాయక చర్యలు అందించాలని, గల్లంతయిన వారిని సాధ్యమైనంత త్వరలో వెలికితీయాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.