అంతర్జాతీయం

ఒబామాకి ఉద్యోగమిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 17: అమెరికా అ ధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొలగనున్న బరాక్ హుస్సేన్ ఒబామా ఇస్లామ్ మతం గురించి సరిగా అర్థం చేసుకునేందుకు వీలుగా తన సంస్థలో ఉద్యోగం ఇస్తానని దుబాయ్‌కి చెందిన ఈసా బిన్ హైదర్ అనే న్యాయవాది ప్రకటించాడు. ఉగ్రవాదంతో ఇస్లామ్ మతానికి, ముస్లింలకు సంబంధం ఉందని పేర్కొం టూ పాశ్చాత్య దేశాల ప్రచార మాధ్యమాలు తరచుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రతిపాదన చేశాడని మంగళవారం మీడియాలో వచ్చిన వార్తలు స్పష్టం చేశాయి. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా పదవీ కాలం ముగిసిన తర్వాత ముస్లింలతో కలసి జీవించి ఇస్లామ్ మతం గురించి అవగాహనను పెంపొందించుకునేందుకు దుబాయ్‌లోని తన సంస్థలో ఉద్యోగిగా చేర్చుకోవడంతో పాటు మంచి వేతనం, గృహ వసతి కల్పిస్తానని, అరబ్ దేశాల్లో పర్యటించేందుకు వీలుగా ఆయనకు టిక్కెట్లు కూడా సమకూరుస్తానని హైదర్ ‘ట్విట్టర్’లో పేర్కొన్నాడు.
అందరికీ తన ప్రతిపాదన అసాధారణమైనదిగానూ, విచిత్రమైనదిగాను అనిపిస్తుందన్న విషయం తెలుసని, అయినప్పటికీ ఒబామా రాజకీయాలకు అతీతంగా ముస్లింలతో సన్నిహితంగా గడిపి ఇస్లామ్ మత సహనం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హైదర్ ట్వీట్ చేశాడు.