అంతర్జాతీయం

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని నేనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 20: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఖాయమని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకర ప్రకటనలను గట్టిగా ఎదుర్కొన్నందు వల్ల తనకే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం లభిస్తుందని హిల్లరీ క్లింటన్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘మా పార్టీ అభ్యర్థిగా నేనే ఉంటాను. ఈ విషయం ఇప్పటికే దాదాపు ఖాయమయింది. నాకు పార్టీ అభ్యర్థిత్వం దక్కకుండా పోయే అవకాశమే లేదు’ అని హిల్లరీ క్లింటన్ సిఎన్‌ఎన్ న్యూస్ చానల్‌తో అన్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి అవసరమైన 2,383 మంది ప్రతినిధుల మద్దతు ఆమెకు ఇంకా లభించలేదు. అయితే 2,293 మంది ప్రతినిధుల మద్దతును ఇప్పటికే సంపాదించిన హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో చాలా ముందున్నారు. ఇంకా ప్రైమరీ ఎన్నికలు జరగాల్సి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒకవేళ ఆమె ఓడిపోయినప్పటికీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం ఆమెకే దక్కుతుంది. సూపర్ డెలిగేట్స్‌గా పేర్కొనే పార్టీలోని నాయకుల్లో గల ఆమె మద్దతుదారులంతా ఇప్పటికీ ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం ఖాయమనే ధీమా మీకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా, ‘నాకు విశ్వాసం ఉంది. నాకున్న అనుభవం మీకు తెలుసు’ అని హిల్లరీ క్లింటన్ బదులిచ్చారు. ‘అప్పటి సెనేటర్ బరాక్ ఒబామాకు వ్యతిరేకంగా నేను చివరి వరకు పోరాడాను. చివరి 12 పోటీల్లో నేను తొమ్మిదింటిలో గెలిచాను. 2008లో నేను ఇండియానా, కెన్‌టుక్కి, పశ్చిమ వర్జీనియాలో గెలిచాను’ అని హిల్లరీ వివరించారు. అయితే తాను, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తనతో పోటీ పడుతున్న వెర్మోంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ ఒకే విధమైన నియమాలను పాటిస్తున్నామని ఆమె చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి అర్హుడేనా? అని ప్రశ్నించగా, లేదని ఆమె బదులిచ్చారు. ముఖ్యంగా గత వారం బ్రిటన్‌పై దాడికి దిగుతూ, ఉత్తర కొరియా నియంతను పొగిడిన ట్రంప్ ప్రకటనలు తీవ్ర ప్రమాదకరమైనవని హిల్లరీ అన్నారు.