అంతర్జాతీయం

అస్పష్ట చట్టాలను రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 24: రాజద్రోహం, నేరపూరిత పరువు నష్టం వంటి అస్పష్ట పదాలతో రూపొందించిన కొన్ని చట్టాలు భారత్‌లో భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను నిర్మూలించేందుకు వినియోగిస్తున్నారని మానవ హక్కుల రక్షణ సంస్థ (హ్యూమన్ రైట్స్ వాచ్ - హెచ్‌ఆర్‌డబ్ల్యు) తన తాజా నివేదికలో ఆరోపించింది. ఈ చట్టాలను శాంతియుతంగా భావ వ్యక్తీకరణ చేయటాన్ని నేరంగా చేసేందుకు వాడుతున్నారని విమర్శించింది. తమను విమర్శించే వారిని భారతీయ అధికారులు నేరగాళ్లుగా పరిగణించటాన్ని ఆపాలని ‘స్ట్ఫ్లింగ్ డిసెంట్-ది క్రిమినలైజేషన్ ఆఫ్ పీస్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ ఇండియా’ అన్న 108 పేజీల నివేదికలో డిమాండ్ చేసింది. అత్యంత విస్తృతమైన అర్థంలో రూపొందించిన చట్టాలను రాజకీయ ప్రయోజనాలకోసం పదే పదే దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించింది. భారత్‌లోని ఈ చట్టాలు అణచివేత సమాజానికి హాల్‌మార్క్ వంటిదని.. విశాలమైన ప్రజాస్వామ్యానికి కాదని హెచ్‌ఆర్‌డబ్ల్యు దక్షిణాసియా డైరెక్టర్ మీనాక్షీ గంగూలీ అన్నారు. విమర్శకులను జైల్లో పెట్టడం.. వారిని తమను తాము రుజువు చేసుకునేలా ఒత్తిడి చేయటం.. సుదీర్ఘమైన కోర్టు విచారణ వంటివి ఇంటర్నెట్ ప్రపంచంలో భారత్‌ను ఆధునిక దేశంగా పరిగణించజాలవని ఆమె అన్నారు.

జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌పై రాజద్రోహం కింద కేసు పెట్టి జైలుకు పంపించటాన్ని ఆమె తప్పు పట్టారు. స్వేచ్ఛాగళానికి సంకెళ్లు వేస్తున్నారని ఆమె విమర్శించారు.