అంతర్జాతీయం

ఊహకందనంత ద్రవ్యరాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో, జూన్ 1: పాలపుంత మొత్తం ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 700 బిలయన్ రెట్లు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూర్యుడి మొత్తం ద్రవ్యరాశి 2 నానిలియన్లు. అంటే 2 తరువాత 30 సున్నాల కిలో గ్రాములన్నమాట! మరో రకంగా చెప్పుకోవాలంటే ఈ భూమి ద్రవ్యరాశి కంటే సూర్యుడి ద్రవ్యరాశి 3 లక్షల 30వేల రెట్లు ఎక్కువ. ఈ విశ్వంలో మన పాలపుంత అత్యంత పెద్ద గెలాక్సీ కాకపోయినా దీని మొత్తం ద్రవ్యరాశి అపారమేనని మెక్ మాస్టర్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్త గ్వెండోలిన్ ఈడి తెలిపారు. ఒక గెలాక్సీ లేదా నక్షత్ర మండల ద్రవ్యరాశిని అంచనా వేయడం అంత సులభం కాదని అందుకు కారణం నక్షత్రాలు, గ్రహాలు, ఇతర గ్రహాల చంద్రుళ్లు, దుమ్ము, దూళి, తోకచుక్కలు గ్రహ శకలాలు వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ ద్రవ్యరాశిని అంచనా వేసేటప్పుడు కృష బిలాలు శూన్య పదార్థాలను పరిగణలోకి తీసుకోలేదని, అందుకు కారణం వీటి గురించి పూర్తి అవగాహన లేకపోవడమేనని పేర్కొన్నారు.