అంతర్జాతీయం

అవినీతిని పెకిలించేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, జూన్ 5: భారత్‌లో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించివేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి అలవాటు పడ్డ ఎందరి నోళ్లనో కట్టేశానని..ఆ విధంగా ఎన్నో సమస్యలూ ఎదుర్కొన్నానని చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో లోపాలను, వాటి దోపిడీని అరికట్టడం ద్వారా ఏటా 36వేల కోట్ల రూపాయలను ఆదా చేయగలిగానని ఇక్కడి భారత సంతతిని ఉద్దేశించి ఆదివారం చేసిన ప్రసంగంలో వెల్లడించారు. కటర్‌లో రెండురోజుల పర్యటన ముగింపు సందర్భంగా మాట్లాడిన మోదీ ‘ఇప్పటి వరకూ అవినీతిని మాత్రమే ప్రక్షాళన చేయగలిగాం..ఇంకా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాల్సి ఉంది’అని తెలిపారు. వ్యవస్థలోని జాడ్యాలను తొలగించడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ 125కోట్ల మంది ఆదరాభిమానాలు తనకు ఉందన్న శక్తే తనను ముందుకు నడిపిస్తోందని చెప్పారు. తన తల్లి మిఠాయిలు ఇవ్వక పోతే చిన్నపిల్లవాడు ఎలా ఏడుస్తాడో ప్రభుత్వ చర్యలపై విపక్షాల విమర్శలూ అలాగే ఉన్నాయన్నారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపూ ప్రవాస భారతీయులు హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు. ఆర్థిక పారదర్శకత, క్రమశిక్షణ, సామర్థ్యాన్ని పెంచేందుకు తాము తీసుకున్న చర్యలు సరైన ఫలితాలను ఇస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో లోపాలను, లీకేజీలను తొలగించి 35వేల కోట్ల రూపాయలను ఆదా చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కోటి 62లక్షల నకిలీ రేషన్ కార్డులను తొలగించామని, సబ్సిడీ గోధుమలు, కిరోసిన్, ఎల్‌పిజి ద్వారా వందలాది కోట్ల రూపాయలను పొదుపు చేయగలిగామని చెప్పారు. నల్లి దొలిచేసి నట్టుగా భారత వ్యవస్థను ఇనే్నళ్లూ అవినీతి దొలిచేసి డొల్ల చేసిందంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై పరోక్షంగా మోదీ ధ్వజమెత్తారు. తాము చేపట్టిన చర్యల వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని, దేశ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడించాయని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా కరవుకాటక పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ గత త్రైమాసికంలో 7.9శాతం మేర స్థూలజాతీయోత్పత్తిలో వృద్ధిని సాధించామని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో రకాలుగా మాంద్య పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని, అన్ని విధాలుగా ఉత్తమమైన దేశాలు సైతం ఇబ్బంది పడుతున్నాయని చెప్పిన మోదీ ‘ఎన్నో సమస్యలు, సవాళ్లు ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోంది’అని ఉద్ఘాటించారు. భారత్-ఖతార్‌ల మధ్య మైత్రీబందం బలోపేతమవుతోందని, ఇక్కడ స్థిరపడ్డ ఆరున్నర లక్షల మంది భారతీయులు ఇందుకు ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. ఖతార్‌లో అధికారికంగా అన్ని కార్యక్రమాలను ముగించుకున్న మోదీ ఆదివారం రాత్రి తన తన తదుపరి గమ్యమైన స్విట్జర్లాండ్‌కు బయలు దేరారు.