అంతర్జాతీయం

ఏడు ఒప్పందాలపై సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, జూన్ 5: భారత్, ఖతార్‌ల మధ్య ఆదివారం ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మనీ లాండరింగ్ (హవాలా), ఉగ్రవాద సంస్థలకు నిధులను అదుపు చేయడానికి ఆర్థిక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన ఒప్పందం, అలాగే ఖతార్‌నుంచి వౌలిక సదుపాయాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ఒప్పందం కూడా వీటిలో ఉన్నాయి. ఖతార్‌లో రెండు రోజుల పర్యటనకోసం శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తనీ మధ్య అధికారిక చర్చలు జరిగిన అనంతరం వారిద్దరి సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. నైపుణ్యం అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, యువత-క్రీడలకు సంబంధించి మిగతా ఒప్పందాలు కుదిరాయి.