అంతర్జాతీయం

అన్ని రంగాల్లోనూ మరింత చేరువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 5: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జరుపుతున్న పర్యటన ఇరు దేశాల మధ్య భద్రతా దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, అలాగే గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏమేరకు వృద్ధిచెందింది అనే దానిపైన సరైన అవకాహన కల్పిస్తుందని అమెరికా విదేశాంగ విభాగం పేర్కొంది. ఒబామా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో భద్రత, దౌత్య, వ్యూహాత్మక రీతిలో ఇరు దేశాల మధ్య పరస్పర సంబంధాలు అనేక కోణాల్లో బలోపేతం అయ్యాయని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి అలిసా ఆరెస్ వెల్లడించారు. తాజా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ జరిపే కీలక భేటిలో అనేక ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు వస్తాయని, మోదీ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ఓ విందు కూడా సిద్ధమవుతోందని వెల్లడించారు. 2014 నుంచి బరాక్ ఒబామా నరేంద్ర మోదీల మధ్య ఆరుసార్లు సమావేశాలు జరిగాయని, అలాగే అనేక సందర్భాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురి మధ్య టెలిఫోన్ సంభాషణలు కూడా జరిగాయని స్పష్టం చేశారు. అలాగే ఈ తాజా పర్యటన అనేక కోణాల్లో ప్రాధాన్యతను సంతరించుకుందని, రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహజసిద్ధమైన భాగస్వామ్యాన్ని కూది ఇది ప్రతిబింబిస్తోందని స్పష్టం చేశారు. ఒబామాతో మోదీ జరిపే చర్చల్లో పర్యావరణ మార్పుల నిరోధన, స్వచ్ఛ ఇంధన, భద్రతా దౌత్య సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడం, ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై దృష్టిపెట్టడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా ఇరు దేశాల ఆర్థిక వృద్ధిలో, సంపను పెంపొందించడంలో నిలకడతనాన్ని బలోపేతం చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 21వ శతాబ్దంలో భారత్ నిర్ణయాత్మకమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలన్న బరాక్ ఒబామా నిర్ణయం వల్ల అనేక రకాలుగా భారత్‌కు నేరుగానే మేలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ పర్యటన అనేక రకాలుగా రక్షణ సహకారాన్ని ఎంతగానో బలోపేతం చేస్తుందని, అదే విధంగా అమెరికాలో కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని కూడా ఓ బలమైన మైత్రీ వారసత్వాన్ని అందించబోతోందని వెల్లడించారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) గ్రూపులో భారత సభ్యత్వానికి సంబంధించిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఒబామా ధ్రువీకరించే అవకాశం కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే భారత్ ఆర్థిక వృద్ధి పట్ల ఒబామా కనబరుస్తున్న ఆసక్తి స్పష్టమవుతోందని, అదే విధంగా పరస్పర సహకారంతో ఇరుదేశాలు ముందుకు వెళ్లాలన్న ఆయన ఆలోచన కూడా ప్రస్ఫుటిస్తోందని వెల్లడించారు.

ఎన్‌ఎస్‌జి ప్రమాణాలు పాటించాల్సిందే

సంపాదకీయంలో స్పష్టం చేసిన న్యూయార్క్ టైమ్స్

వాషింగ్టన్, జూన్ 5: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం లభించాలంటే దీనితో ముడివడిన అన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. 48 దేశాల సభ్యత్వం కలిగిన ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం పొందాలంటే ఇందుకు అభ్యంతరం చెబుతున్న చైనా, పాకిస్తాన్‌లతో భారత్ సామరస్యపూర్వక చర్చలు జరపాలని తన సంపాదకీయం ఈ పత్రిక వెల్లడించింది. సభ్యదేశాలన్నీ కూడా అణవ్యాప్తి నిరోధక ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని, భారత్ కూడా వీటిని త్రికరణశుద్ధిగా పాటించేలా చూడాలని అమెరికా నాయకత్వానికి ఈ పత్రిక స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వం కోసం ఒబామా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న నేపథ్యంలో ఆదేశానికి చెందిన ఒక జాతీయ పత్రిక ఏకంగా ఒక సంపాదకీయానే్న రాయడం గమనార్హం. ముఖ్యంగా ఒబామా, నరేంద్ర మోదీ మంగళవారం వైట్‌హౌస్‌లో సమావేశం జరగనున్న దృష్ట్యా దీనికి అనేక కోణాల్లో ప్రాధాన్యత చేకూరింది.