అంతర్జాతీయం

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 7: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని హిల్లరీ క్లింటన్ దాదాపుగా దక్కించుకున్నారు. దీంతో 249 ఏళ్ల అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీనుంచి అభ్యర్థిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె అరుదైన రికార్డును సైతం సృష్టించబోతున్నారు. ఆదివారం ప్యూర్టోరికోలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంతో పాటుగా అదనపు సూపర్‌డెలిగేట్ల మద్దతుతో కలిపి 68 ఏళ్ల హిల్లరీ క్లింటన్ పార్టీ అభ్యర్థి కావడానికి అవసరమైన మద్దతును కూడగట్టుకున్నట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. హిల్లరీ క్లింటన్ 1812 మంది కచ్చితమైన డెలిగేట్ల మద్దతుతో పాటుగా 572 మంది సూపర్ డెలిగేట్ల మద్దతును కూడా దక్కించుకున్నారని, అంటే పార్టీ నామినేషన్ కోసం అవసరమైన 2,384 మంది డెలిగేట్లకన్నా ఒకరు ఎక్కువే ఉన్నారని సిఎన్‌ఎస్ తెలిపింది.
కాగా, మంగళవారం పెద్ద సంఖ్యలో డెలిగేట్లుండే కాలిఫోర్నియా, న్యూజెర్సీ సహా ఆరు రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనుండడంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. కాగా, సోమవారం రాత్రి కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో తన మద్దతుదారులనుద్దేశించి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ, తనకు అవసరమైన మద్దతు లభించినప్పటికీ మంగళవారం ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై తాను ఇంకా దృష్టి పెట్టే ఉన్నానని చెప్పారు.వచ్చే నెల జరిగే పార్టీ మహాసభలో మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భార్య, మాజీ విదేశాంగ మంత్రిగా కూడా పని చేసిన హిల్లరీ క్లింటన్‌ను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పటికే రిపబ్లిన్ పార్టీ అభ్యర్థిగా దాదాపుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్‌తో ఆమె అధ్యక్ష పదవికోసం పోటీ పడాల్సి ఉంటుంది. అయితే ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్‌లాగే హిల్లరీ క్లింటన్ కూడా అమెరికా చరిత్రలోనే అత్యంత అన్‌పాపులర్ అభ్యర్థిగా ఉంటారనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేయడం గమనార్హం..