అంతర్జాతీయం

చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, జూన్ 8: అమెరికా రాజకీయ చరిత్రలోనే ఒక ప్రధాన రాజకీయ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ బుధవారం చరిత్ర సృష్టించారు. న్యూజెర్సీ, న్యూమెక్సికో, డకోటా రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆమె డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అర్హతను సంపాదించారు. అయితే ఆమె ప్రధాన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ మాత్రం తాను పోటీనుంచి తప్పుకోబోనని అంటున్నారు.‘ మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు మనం ఒక మైలురాయిని చేరాం. అదేమిటంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఒక ప్రధాన పార్టీ నామినీ అవబోతున్నారు’ అని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో తన ఎన్నికల ప్రచార ప్రధాన కార్యాలయం వద్ద మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ హిల్లరీ క్లింటన్ అన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినీ కావడానికి అవసరమైన 2,383 మంది డెలిగేట్లను గెలుచుకున్నందుకు హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందించారు. అయితే ఒకప్పుడు తన వద్ద విదేశాంగ మంత్రిగా పని చేసిన హిల్లరీ క్లింటన్‌కు ఆయన అధికారికంగా ఆమోదముద్ర వేయలేదు. హిల్లరీ క్లింటన్ నిర్వహించిన చరిత్రాత్మక ప్రచారం కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, మధ్య తరగతి కుటుంబాలు, వారి పిల్లల కోసం ఆమె జీవితకాల పోరాటానికి ఇది కొనసాగింపు అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒబామా హిల్లరీ క్లింటన్, శాండర్స్ ఇద్దరికీ ఫోన్ చేసి డెమోక్రాట్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ప్రచారం సాగించినందుకు వారిని అభినందించారు. కాగా, ఒబామా గురువారం శాండర్స్‌తో సమావేశమవుతారని ఆ ప్రకటన తెలిపింది.
ప్రస్తుతం హిల్లరీ క్లింటన్‌కు 2,487 మంది డెలిగేట్లు ఉండగా, శాండర్స్‌కు కేవలం 1663 మంది డెలిగేట్లే ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో వెలువడిన తొలి ఫలితాల్లోను హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉన్నారు. అయితే మోంటానా, నార్త్ డకోటా రాష్ట్రాల్లో జరిగిన డెమోక్రాట్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించిన శాండర్స్ మాత్రం ఓటమిని అంగీకరించక పోవడమే కాక పార్టీ నామినేషన్ కోసం పోటీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఐక్యత కోసం పోటీనుంచి తప్పుకోవాలని శాండర్స్‌పై తీవ్రమైన ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ న్యూయార్క్‌కే చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యరిథ డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొంటారు.
ఒక వేళ ఆ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిచే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలుగా చరిత్ర సృష్టిస్తారు.