అంతర్జాతీయం

దూసుకెళుతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియన్నా, జూన్ 10: అణు సరఫరాదేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వానికి ఓ వైపు మద్దతు పెరుగుతుంటే మరోవైపు ఇప్పటివరకు నారత్ ఈ గ్రూపులో చేరడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న చాలా దేశాలు సైతం తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన అణు సాంకేతిక పరిజ్ఞానం పొందడంపై ఆంక్షలు విధించే ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరడానికి మార్గం సుగమం చేయడానికి భారత్‌తో పాటుగా అమెరికా సైతం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జిలో భారత్ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న కొన్ని దేశాలు తమ వైఖరిని కొంతమేరకు సడలించుకోవడమే కాకుండా రాజీ దిశగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ‘రాయిటర్’ వార్తాసంస్థ తెలిపింది. చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చాలా దేశాలు మద్దతు ప్రకటించడంతో దిక్కుతోచని పాకిస్తాన్ ఎన్‌ఎస్‌జిలో తాను చేరడానికి కూడా మద్దతు ఇవ్వాలని అమెరికాను కోరడం తెలిసిందే. ఒక వేళ ఎన్‌ఎస్‌జి గనుక భారత్‌ను చేర్చుకోవాలని నిర్ణయిస్తే తన మిత్రదేశమైన పాకిస్తాన్‌ను కూడా చేర్చుకోవాలని చైనా గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే. ‘ఏది ఏమయినప్పటికీ చైనా తన వైఖరిని మరింత కఠినం చేస్తోంది’ అని ఓ దౌత్యవేత్త చెప్పినట్లు రాయిటర్ తెలిపింది.
అణ్వస్త్రాలు తయారు చేయడానికి అవసరమైన వస్తువుల విక్రయాలను పరిమితం చేయడం ద్వారా అణ్వస్త్ర వ్యాప్తిని అడ్డుకునే ఉద్దేశంతో 48 దేశాలు సభ్యులుగా ఎన్‌ఎస్‌జిని ఏర్పాటు చేశారు. 1974లో భారత్ తన తొలి అణు పరీక్ష జరపడానికి స్పందనగా ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. భారత్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేసుకున్నప్పటికీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయనప్పటికీ అమెరికాతో అది కుదుర్చుకున్న అణు సహకార ఒప్పందానికి మద్దతుగా 2008లో ఎన్‌ఎస్‌జి తన నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో భారత్ ఒక సభ్య దేశం పొందే సదుపాయాల్లో చాలా వాటిని ఇప్పటికే పొందుతోంది. అయితే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వానికి ఎన్‌పిటిపై సంతకం చేయడమే కీలకమని చైనా గురువారం వియన్నాలో జరిగిన ఎన్‌పిటి సమావేశంలో పునరుద్ఘాటించినట్లు దౌత్యవేత్తలు చెప్పారు.
ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వాన్ని ఆరు దేశాలు చైనా, న్యూజిలాండ్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రియాలు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటి లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, టర్కీ లు ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరడంపై తన వైఖరిని కొంతమేరకు సడలించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాల వైఖరిలో మార్పు రావడంతో భారత్‌లాంటి ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలు సైతం ఎన్‌ఎస్‌జిలో చేర్చుకునే ప్రక్రియకు మార్గం సుగమం అయింది. ఈ ప్రక్రియలో కదలిక మొదలైందని, అయితే ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుందో తమకు తెలియదని ఈ నెలచివర్లో సియోల్‌లో ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశానికి ముందు వియన్నాలో జరిగిన రహస్య చర్చల తర్వాత ఓ దౌత్యవేత్త చెప్పారు.