అంతర్జాతీయం

భారత్ ఎన్‌ఎస్‌జి ఆశలు ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూన్ 24: అణు సరఫరాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందేందుకు చివరి క్షణం వరకూ భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారత్ సహా అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం కల్పించే ప్రసక్తి లేదని ఎన్‌ఎస్‌జి స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అణు వ్యాప్తి నిరోధనను పూర్తిగా, సమర్థవంతంగా అమలు చేయడానికి ఎన్‌పిటిని పరిపూర్ణ రీతిలో అమలు చేయాల్సిందేనని 48దేశాల ఎన్‌ఎస్‌జి కూటమి తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదని శుక్రవారం రెండు రోజుల ప్లీనరీ ముగిసిన అనంతరం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎన్‌పిటిపై సంతకాలు చేయని దేశాల భాగస్వామ్యంపై చర్చలను కొనసాగిస్తామని వెల్లడించింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తు గురించి ఈ ప్లీనరీలో చర్చించామని అణు సరఫరాల గ్రూపు ధ్రువీకరించింది. భారత్‌తో పౌర అణు సహకారంపై 2008లో చేసిన ప్రకటనకు సంబంధించిన అన్ని అంశాలతో పాటు భారత్‌తో తమ గ్రూపునకు గల సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించామని ‘ఔట్‌రీచ్’ అనే ఉప శీర్షికతో విడుదల చేసిన ప్రకటనలో ఎన్‌ఎస్‌జి పేర్కొంది. ‘అణ్వస్త్రాల వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన మైలురాయిగా ఉన్న ఎన్‌పిటిని పూర్తిస్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు కొండంత అండగా నిలుస్తామని ఈ ప్లీనరీ సమావేశంలో వివిధ దేశాల ప్రభుత్వాలు పునరుద్ఘాటించాయి’ అని ఎన్‌ఎస్‌జి ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలకు తమ గ్రూపులో భాగస్వామ్యం కల్పించాలా? లేదా? అన్నదానిపై సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాల గురించి ఈ ప్లీనరీలో చర్చించామని, మున్ముందు కూడా ఈ చర్చలను కొనసాగిస్తామని ఎన్‌ఎస్‌జి పేర్కొంది.
ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తుపై గురవారం రాత్రి ప్రత్యేక సమావేశంలో అణు సరఫరాల గ్రూపు చర్చించింది. అయితే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని భారత్‌ను ఎన్‌ఎస్‌జిలో చేర్చుకోరాదని చైనాతో పాటు మరికొన్ని ఇతర దేశాలు వ్యతిరేకించాయి. ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్రాల వ్యాప్తి కొనసాగుతుండటం పట్ల ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అణు సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కాకుండా నిరోధించి అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టేందుకు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని సభ్య దేశాలు కృతనిశ్చయానికి వచ్చాయని ఎన్‌ఎస్‌జి తెలిపింది.