అంతర్జాతీయం

నేనింకా ‘బతికే’ ఉన్నా..! ఎలిజబెత్ రాణి ఉద్ఘాటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 28: ‘నేనింకా బతికే ఉన్నాను’ అంటూ బ్రిటన్ రాణి ఎలిజబెత్ అన్నారు. యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటిష్ ప్రజలు ఓటేసిన అనంతరం తొలిసారి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి ఆమెను ప్రశ్నించినప్పుడు తానింకా బతికే ఉన్నానని రాణి చెప్పారు. గత కొద్ది రోజులుగా ఈయూ నుంచి బయటకు వెళ్లాలని బ్రిటన్ ప్రజలు నిర్ణయించటం, పౌండ్ 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవటం, ప్రధాని డేవిడ్ కామరూన్ రాజీనామా పరిణామాల నేపథ్యంలో ఎలిజబెత్ రాణి ఉత్తర ఐర్లాండ్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. ఈ సందర్భంగా ఉత్తర ఐర్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ మార్టిన్ మెగ్‌గినె్నస్ ఆమెను పలకరిస్తూ ‘ ఎలా ఉన్నారు’ అని అన్నారు. వెంటనే ఆమె ‘నేను బతికే ఉన్నా. మేం చాలా బిజీగా ఉన్నాం. దేశంలో చాలా జరుగుతున్నాయి’ అని అన్నారు. ఆమె వ్యాఖ్యలు బ్రిటన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించా కాదా అన్న దానిపై స్పష్టత లేదు. ఆమె ఇటీవలే 90వ జన్మదినాన్ని వైభవంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.