అంతర్జాతీయం

ఇంగ్లీషుపై వేటు వేయనున్న ఇయు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 28: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలిగాక ఐరోపా కూటమి ఇంగ్లీషును కూడా తమ అధికారిక కార్యకలాపాలనుంచి తప్పించేయనున్నారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లోని విద్యా సంస్థలతోపాటు ఇతర సంస్థల్లో ఇంగ్లీషును ప్రధాన భాషగా వాడుతున్నారు. అయితే గత వారం జరిగిన రెఫరెండంలో బ్రిటన్ ఇయునుంచి వైదొలగడానికి అనుకూలంగా నిర్ణయించుకోవడంతో ఇప్పుడు ఇయులోని మిగతా దేశాల్లో ఇంగ్లీషు వాడకంపై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. ఇయులోని ప్రతి దేశానికి ఒక అధికారిక భాషను నోటిఫై చేసుకునే అధికారం ఉంటుందని, ఈ మేరకు ఇయు రాజ్యాంగంలో ఒక నిబంధన ఉందని ఇయు పార్లమెంటు రాజ్యాంగ వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలు, పోలండ్‌కు చెందిన యూరోపియన్ పార్లమెంటు సభ్యురాలు దనుతా హబ్నర్ సోమవారం బ్రస్సెల్స్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఐర్లాండ్ గీలిక్ భాషను నోటిఫై చేసిందని, మాల్టా మాల్టీస్‌ను నోటిఫై చేసిందని, అలాగే బ్రిటన్ మాత్రమే ఇంగ్లీషును నోటిఫై చేసిందని ఆమె అన్నారు. ఇయు సభ్య దేశాలైన ఐర్లాండ్, మాల్టాలలో రోజువారీ వ్యవహారాల్లో ఇంగ్లీషు భాషనే వాడడం గమనార్హం. ‘ఇయు పౌర అధికారులు, యూరోపియన్ పార్లమెంటు సభ్యులు ప్రధానంగా ఇంగ్లీషునే ఎక్కువగా వాడినప్పటికీ చట్టపరంగా చూసినట్లయితే ఇయులో బ్రిటన్ లేనప్పుడు ఇంగ్లీషు కూడా ఉండదు’ అని ఆమె చెప్పినట్లు ‘టైమ్స్’ దినపత్రిక తెలిపింది. ఒకవేళ ఇంగ్లీషును ఉంచాలంటే నిబంధనలను మార్చాల్సి ఉంటుంది. అందుకు ఇయులోని 27 సభ్య దేశాలు ఏకగ్రీవంగా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఇయులో 24 అధికారిక భాషలున్నప్పటికీ రోజువారీ వ్యవహారాలకు యూరోపియన్ కమిషన్, మంత్రి మండలి సభ్యులు ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మనీ భాషలను మాత్రమే ఉపయోగిస్తుంటారు.
అయిదు దేశాలు తప్ప ఇయులోని మిగతా సభ్య దేశాలన్నిటిలోను ఇంగ్లీషే ప్రధానంగా ఉపయోగించినప్పటికీ బ్రిటన్ ఇయునుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పటినుంచి దాని ఆధిక్యతకు ముగింపు పలకాలని ఫ్రాన్స్ నేతృత్వంలో మిగతా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే జర్మనీ మాత్రం ఫ్రాన్స్ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. ఇయు సభ్య దేశాల్లో చాలా దేశాలు ఇంగ్లీషు మాట్లాడుతాయని, అంతేకాకుండా అది ప్రపంచ భాష అనే విషయాన్ని అంగీకరించి తీరాలని జర్మనీకి చెందిన ఇయు కమిషనర్ గుంథర్ ఒట్టింగర్ అన్నారు. ఒకవేళ ఇంగ్లీషు గనుక ఇయు ప్రధాన భాష హోదాను కోల్పోయినట్లయితే ఇయుకు చెందిన డాక్యుమెంట్లన్నిటినీ 24 అధికారిక భాషల్లోకి తర్జుమా చేయాల్సి ఉంటుంది.