అంతర్జాతీయం

రోజూ మూడు సూర్యోదయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 8: ఆసక్తికరమైన ఎన్నో ప్రత్యేకతలతో భూమికి దాదాపు 340 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సరికొత్త గ్రహాన్ని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. గురు గ్రహం కంటే నాలుగు రెట్లు అధిక ద్రవ్యరాశిని కలిగివున్న ఈ గ్రహం మూడు నక్షత్రాల (సూర్యుల) చుట్టూ పరిభ్రమిస్తోందని, కనుక కాలాలను బట్టి ఈ గ్రహంపై రోజుకు మూడుసార్లు సూర్యోదయాలు, మూడుసార్లు సూర్యాస్తమయాలు జరుగుతాయని, ఈ గ్రహంపై ఒక రోజు సమయం మనిషి జీవితం కంటే కూడా ఎంతో ఎక్కువగా ఉంటుందని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. హెచ్‌డి 131399 ఎబి అనే ఈ గ్రహం భూగోళానికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, దాదాపు 1.6 కోట్ల సంవత్సరాల వయసున్న ఈ గ్రహం సౌర మండలానికి వెలుపల ఇప్పటివరకూ కనుగొన్న గ్రహాల్లో అన్నిటికంటే తక్కువ వయసు కలిగిన గ్రహమని, గురు గ్రహం కంటే నాలుగు రెట్లు అధిక ద్రవ్యరాశిని, దాదాపు 580 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగివున్న ఈ గ్రహం భూమి నుంచి నేరుగా ఫొటోలు తీయగలిగిన అతికొద్ది గ్రహాల్లో ఒకటని శాస్తవ్రేత్తలు తెలిపారు. ‘్భగోళం నుంచి నేరుగా ఫొటోలు తీయగలిగిన అతికొద్ది గ్రహాల్లో హెచ్‌డి 131399 ఎబి ఒకటి. సౌర మండలానికి వెలుపల ఇప్పటివరకూ కనుగొన్న గ్రహాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రత్యేకతలను కలిగివున్న తొలి గ్రహం కూడా ఇదే’ అని అమెరికాలోని అరిజోనా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డానియెల్ అపాయి పేర్కొన్నారు. మూడు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహం తన కక్ష్యలో దాదాపు సగం దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం భూమిపై 550 సంవత్సరాల కాలంతో సమానమని, అక్కడ ఆకాశంలో కనిపిస్తున్న మూడు నక్షత్రాల్లో రెండు నక్షత్రాలు ఆ గ్రహానికి అత్యంత సమీపంగా ఉండి సంవత్సరమంతా మిరుమిట్లు గొలిపేలా ప్రకాశిస్తున్నాయని దానిని కనుగొన్న అపాయి పరిశోధక బృందంలోని పిహెచ్‌డి మొదటి సంవత్సర విద్యార్థి కెవిన్ వాగ్నర్ వెల్లడించారు.