అంతర్జాతీయం

‘పీస్ టివి బంగ్లా’ ప్రసారాలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 10: భారత్‌లోని వివాదాస్పద బోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ‘పీస్ టివి బంగ్లా’ ప్రసారాలను బంగ్లాదేశ్ ఆదివారం నిషేధించింది. జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలతో బంగ్లాదేశ్‌లోని కొంతమంది మిలిటెంట్లు ప్రేరేపితమయ్యారని, వారే ఇటీవల ఢాకాలోని ఒక రెస్టారెంట్‌పై దాడి చేసి ఊచకోతకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ‘పీస్ టివి బంగ్లా’ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమల మంత్రి అమీర్ హుస్సేన్ అము అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన శాంతిభద్రతలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా చేసిన ప్రసంగాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలించాలని కూడా క్యాబినెట్ కమిటీ నిర్ణయించినట్లు ఈ సమావేశాన్ని నిర్వహించిన అమీర్ హుస్సేన్ విలేఖరులకు తెలిపారు. ఢాకాలో ఈ నెల ఒకటిన 22 మందిని హతమార్చిన మిలిటెంట్లు నాయక్ ప్రసంగాలకు ప్రేరేపితులు కావడంవల్లే ఆ అమానుషానికి పాల్పడ్డారనే విశ్వాసం బలంగా ఉంది. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని వ్యతిరేకించే నిజమైన ఇస్లామిక్ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రసంగాలు ఇవ్వాలని కూడా బంగ్లాదేశ్‌లోని ఇమామ్‌లకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సీనియర్ మంత్రులతో పాటు పోలీసు విభాగం అధిపతి, రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్‌ఎబి) చీఫ్, పారామిలిటరి బోర్డర్ గార్డ్స్ చీఫ్, వివిధ భద్రతా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు ఈ క్యాబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ వద్ద అదనపు బలగాలను మోహరించాలని క్యాబినెట్ కమిటీ ఆదేశించింది.