అంతర్జాతీయం

మేమే గెలిచాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జూలై 10: ఆస్ట్రేలియాలో వారం రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ఎన్నికల్లో తామే విజయం సాధించామని ప్రధాని మాల్కమ్ టర్న్‌బిల్ ప్రకటించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ అధినేత బిల్ షార్టెన్ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని టర్న్‌బిల్‌కు ఫోన్ చేసిన కొద్దిగంటల వ్యవధిలోనే ప్రధాని టర్న్‌బిల్ విజయం మాదేనంటూ ప్రకటించారు. ‘మా ప్రభుత్వ పథకాలే విజయాన్ని చేకూర్చాయి. ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు’ అంటూ ప్రధాని టర్న్‌బిల్ పేర్కొన్నారు. గవర్నర్ జనరల్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మరో వారం రోజుల వరకు టర్న్‌బిల్ ప్రమాణ స్వీకారం చేసే సూచనలు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో కొందరు మంత్రులు ఓటమిపాలు కావడంతో కేబినెట్‌లో మార్పులు అనివార్యమని టర్న్‌బిల్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. 150 సీట్లు కలిగిన పార్లమెంటులో లిబరల్ నేషనల్ 74 సీట్లు కైవసం చేసుకోగా, లేబర్ పార్టీ 66 సీట్లను గెలుచుకుంది. మరో ఐదుసీట్ల ఓట్లను లెక్కించాల్సి వుంది.