అంతర్జాతీయం

ఇమ్రాన్‌ఖాన్ ‘హ్యాట్రిక్’ పెళ్లి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 12: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారా? లండన్‌లో జరిగిన ఓ స్వల్ప కార్యక్రమంలో ఆయన మూడోపెళ్లి చేసుకున్నట్లుగా మంగళవారం వెలువడిన మీడియా కథనాల బట్టి స్పష్టమవుతోంది. తాను గతంలో చేసుకున్న రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులు కావడం వల్ల మూడో పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ 63 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లిళ్ల విషయంలో హ్యాట్రిక్ చేశాడంటూ దునియా టీవీ వెల్లడించింది. మనేకా కుటుంబానికి చెందిన ఓ మహిళను ఇమ్రాన్‌ఖాన్ పెళ్లి చేసుకున్నాడని, ఈ పెళ్లి కూడా కొన్ని రోజుల క్రితం లండన్‌లో జరిగింది ఆ టీవీ వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రభావశీలత కలిగిన మనేకా కుటుంబానికి చెందిన పింకి అనే మహిళా ఆధ్యాత్మికవేత్త సూచనల ప్రకారమే ఇమ్రాన్‌ఖాన్ ఈ మూడో పెళ్లి చేసుకున్నట్లు జియో టీవీ వెల్లడించింది. మరో రెండు చానెళ్లయితే కొత్త భార్యతో ఖాన్ అనేకచోట్ల కనిపించాడని ప్రసారం చేశాయి. అయితే ఈ మూడో భార్య ఎవరన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. జియో చానల్ మాత్రం ఆమె పేరు మారియామ్ అని వెల్లడించింది. అయితే ఇమ్రాన్‌ఖాన్ మూడో పెళ్లి కథనాలు అభూత కల్పనలేనని ఆయన సారథ్యంలోని పాకిస్తాన్ తహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ వర్గాలు కొట్టిపారేశాయి. త్వరలోనే లండన్ నుంచి ఇమ్రాన్ తిరిగొస్తాడని, దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాడని వెల్లడించాయి. తాము కూడా ఈ హ్యాట్రిక్ పెళ్లి కథనాలు చానెళ్లలో చూసి నవ్వుకున్నామని కూడా వెల్లడించాయి.