అంతర్జాతీయం

బిగ్‌బ్యాంగ్ కాదు.. బిగ్‌బౌన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: విశ్వావిర్భావినికి బిగ్‌బ్యాంగ్ మూలమన్నది ఇప్పటి వరకు ఇటు ఖగోళవేత్తలు, అటు భౌతిక వేత్తలు చెప్తూ వస్తున్న విషయం. ఇంతకీ మన విశ్వమే తొలి విశ్వమా? లేక దీనికంటే ముందు మరో విశ్వం ఉందా? అనే కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తొలి విశ్వం కుప్పకూలడం వల్లే దాన్నుంచి బిగ్‌బౌన్స్‌గా మన విశ్వం ఆవిర్భవించిందని తాజా పరిశోధనలో వెల్లడించారు. మన విశ్వం పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి బిగ్‌బౌన్స్ సిద్ధాంతం తాజాగా వెలుగులోకి వస్తోంది. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలను, భౌతిక పరమైన అంశాలను ఈ సిద్ధాంతం ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. నిజానికి 1922లోనే బిగ్‌బౌన్స్ సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ సిద్ధాంతాన్ని వివరించగలిగే పరిస్థితి లేకపోవడం వల్ల రోదసి ఏ విధంగా విస్తరించిందీ అనే అంశాన్ని సరైన రీతిలో వెల్లడించకపోవటం వల్ల బిగ్‌బౌన్స్ అనుకున్న స్థాయిలో వెలుగులోకి రాలేదు.
అయితే తాజాగా లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన స్టెఫెన్ గీలెన్స్ కెనడాలోని భౌతిక సిద్ధాంతాల అధ్యయన కేంద్రం డైరెక్టర్ నీల్ టురోక్ ఈ అధ్యయనం జరిపారు. బిగ్‌బౌన్స్ సిద్ధాంతాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని, వాస్తవానికి విశ్వ ఆవిర్భావం అన్నది దాన్నుంచే జరిగిందని కూడా వీరిద్దరూ తమ పరిశోధనల సారాంశంలో వెల్లడించారు. ప్రస్తుత విశ్వం అత్యంత వేగంగా విస్తరిస్తోందని, అత్యంత దట్టమైన, అనంతమైన వేడి కలిగిన పదార్థం నుంచే అది ఉద్భవించిందని బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం చెప్తోందని, అయితే, భౌతిక పరమైన అంశాలు విచ్ఛిన్నం కావటం వల్లే విశ్వ మూలాలు మొదలయ్యాయని వెల్లడించారు. అనేక దశల్లో ఈ విశ్వం సంకోచ వ్యాకోచాలకు గురైందని, ఆ సందర్భంలో ఎన్నో మార్పులకు లోనైందని తెలిపారు. ప్రస్తుతం విశ్వ విస్తరణ కూడా ఆ సంకోచ వ్యాకోచాల క్రమంలో భాగమేనని చెప్తున్నారు.