అంతర్జాతీయం

భిన్నత్వమే మన బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్, జూలై 13: భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయమని, వీటన్నిటినీ ఒక్కటి చేయడానికి లేదా ఏకరూపం తీసుకు రావడానికి జరిపే ప్రయత్నమేదైనా హానికరమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘్భన్న సంస్కృతుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. వీటిన్నినీ ఒక్కటి చేయడానికి ప్రయత్నించరాదు. ఎందుకంటే అది మన సమాజానికి, దాని భిన్నత్వానికి తీవ్రమైన హాని చేస్తుందని మనకు తెలుసు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం. అదే మనల్ని కలిపి ఉంచుతోంది’ అని బుధవారం ఇక్కడి ‘చౌరాస్తా’ వద్ద నేపాలీ కవి భానుభక్త ఆచార్య 292వ జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి అన్నారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేపాల్‌తో భారత్‌కు చాలా చక్కటి సంబంధాలున్నాయని రాష్టప్రతి అంటూ, ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మనం కోరుకుంటున్నామన్నారు. భానుభక్త ఆచార్య నేపాలీ భాషలో కవిత్వం రాసినప్పటికీ ఆయన సందేశం మొత్తం మానవాళికి వర్తిస్తుందన్నారు. నేపాలీ భాషలో అగ్రగణ్యుడైన ఆచార్యను నివాళి అర్పించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. భిన్న సంస్కృతులు, జాతులకు చెందిన వారిని సమాదరిస్తున్న డార్జిలింగ్ ప్రజలను ఆయన ప్రశంసించారు. అంతకు ముందు డార్జిలింగ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్టప్రతి ఇక్కడి హిమాలయన్ పర్వతారోహక శిక్షణా సంస్థను సందర్శించారు. కాగా, ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ కూడా పాల్గొన్నారు.