అంతర్జాతీయం

ఉగ్రవాది బుర్హాన్ అమరుడన్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 15: పాకిస్తాన్ కాశ్మీర్ అంశంపై మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే చర్యకు దిగింది. కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శుక్రవారం ‘అమరవీరుడి’గా ప్రకటించారు. కాశ్మీర్ ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి జూలై 19ని ‘బ్లాక్ డే’గా పాటిస్తామని తెలిపారు. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై చర్చించడానికి లాహోర్‌లో నిర్వహించిన ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ ‘కాశ్మీర్ ప్రజల ఉద్యమం’.. ‘స్వాతంత్రోద్యమం’ అని అభివర్ణించారు. స్వయం నిర్ణయాధికారం కోసం కాశ్మీర్ ప్రజలు జరుపుతున్న న్యాయమైన పోరాటానికి పాకిస్తాన్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతును కొనసాగిస్తుందని ఆయన ప్రకటించారు.