అంతర్జాతీయం

కత్తితో ఉన్మాది దాడి 19మంది హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగమిహర (జపాన్), జూలై 26: జపాన్‌లోని ఓ కేర్ సెంటర్‌లో ఓ ఉద్యోగి తన సహచర ఉద్యోగులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి 19మందిని హతమార్చాడు. కొన్ని దశాబ్దాల కాలంలో చాలా దారుణమైన మారణకాండగా దీన్ని చెప్పుకుంటున్నారు. జపాన్ రాజధాని టోక్యోకు పశ్చిమాన ఉన్న సగమిహర నగరంలో ఓ కేర్ సెంటర్‌లో సతోషి యుమాట్సు (26) పనిచేసేవాడు. కేర్ సెంటర్‌లో తప్పుడు పనులు చేయటంతో యాజమాన్యం అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో పగ పెంచుకున్న సతోషి మంగళవారం తెల్లవారుజామున 2.10 గంటలకు మొదటి అంతస్తు కిటికీ బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించాడు. అక్కడ ‘కేర్‌గివర్స్’ (సంరక్షకులు)లను తాడుతో కట్టేసి, అందులో నివసిస్తున్న వాళ్లపై కత్తితో దాడికి తెగబడ్డాడు. మొత్తం 19మంది ఈ దాడిలో మరణించారు. ఇరవై మందికి పైగా గాయపడ్డారు. దాడి చేసిన అనంతరం సతోషి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ హత్యలన్నీ తానే చేసినట్టు ఒప్పుకుని లొంగిపోయాడు. చనిపోయిన వారిలో 10మంది మహిళలు, 9మంది పురుషులు ఉన్నారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే నిందితుడు విచక్షణ లేకుండా కత్తిపోట్లకు పాల్పడ్డాడని బాధితులు తెలిపారు.