అంతర్జాతీయం

యూఏఈకి తిరిగొచ్చిన ఇంపల్స్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుధాబి, జూలై 26: సౌరశక్తితో పనిచేసే ఇంపల్స్-2 తన చరిత్రాత్మక యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఒక్క చుక్క కూడా సంప్రదాయ ఇంధనం వాడకుండా, కేవలం సౌర ఇంధనంతో మొత్తం ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి విమానంగా ఇంపల్స్-2 రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 4.05 గంటలకు అబుధాబి విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఇంపల్స్-2 నిరుడు మార్చి 9న తన విశ్వయాత్ర ప్రారంభించింది. సుదీర్ఘ ప్రస్థానంలో ప్రాజెక్టు డైరెక్టర్ బెర్ర్టాండ్ పికార్డ్ కాక్‌పిట్‌లోనే ఉండి పర్యవేక్షించారు. అబుధాబి నుంచి కైరో అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటి, సౌదీ ఎడారి మీదుగా గల్ఫ్ దేశాలను చుట్టి వచ్చి ఆసియా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఉత్తర ఆఫ్రికా ఖండాల మీదుగా మొత్తం రెండు మహా సముద్రాలు, మూడు సముద్రాలపై ప్రయాణించి తిరిగి అబుధాబి చేరుకుంది. ఇంపల్స్-2 42వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ‘ఈ విజయంతో భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తోంది. విమాన యాన చరిత్రలో విజయాల కంటే, ఇంధన చరిత్రలో ఇదొక గొప్ప విజయంగా చెప్పుకోవాలి’ అని పికార్డ్ ఆనందంగా అన్నారు. ‘మన దగ్గర సమృద్ధిగా పరిష్కారాలు ఉన్నాయి. సమృద్ధిగా సాంకేతిక పరిజ్ఞానమూ ఉంది. ప్రపంచం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’ అని ఆయన అన్నారు. 13 ఏళ్లక్రితం మొదలైన పరిశోధన ఇప్పటికి సత్ఫలితాలనిచ్చింది అని ఆయన అన్నారు. భవిష్యత్తు ఇక పరిశుభ్రంగా ఉంటుందని తన విశ్వాసమని ట్వీట్ చేశారు. ఇంపల్స్-2 రెక్కలపై 17వేల సోలార్ సెల్స్‌ను ఏర్పాటు చేశారు. దీని సగటు వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఆకాశంలో ఎక్కువ ఎత్తుకు వెళ్లినప్పుడు పైలట్లు ఆక్సిజన్‌ను శ్వాసకోసం వినియోగించారు. కాక్‌పిట్‌లో ఉష్ణోగ్రత 20 నుంచి 35డిగ్రీ సెల్సియస్ దాటకుండా జాగ్రత్తపడ్డారు. దీనివల్లే సంప్రదాయేతర ఇంధనమైన సౌరశక్తితో విజయవంతంగా విమానం ప్రపంచాన్ని చుట్టివచ్చిందని పికార్డ్ అన్నారు.