అంతర్జాతీయం

స్నోడెన్ విజిల్‌బ్లోయర్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: సిఐఎ మాజీ కాంట్రాక్టర్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ విజిల్‌బ్లోయర్ కాదని, అమెరికా జాతీయ భద్రతను, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టిన వ్యక్తి అని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన లక్షలాది రహస్య పత్రాలను బహిర్గతం చేయడం ద్వారా స్నోడెన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష పదవినుంచి దిగిపోవడానికి ముందు ఆయన నుంచి క్షమాభిక్షను పొందాలని భావిస్తున్న స్నోడెన్ ఆశలపై వైట్‌హౌస్ చేసిన ప్రకటన నీళ్లు చల్లినట్లయింది.
‘విజిల్‌బ్లోయర్‌లు తమ ఆందోళనలను లేవనెత్తడానికి నిర్దిష్టమైన, రక్షణాత్మకమైన ఒక ప్రక్రియ ఉంది. ముఖ్యంగా రహస్య సమాచారానికి సంబంధించిన విషయంలో విజిల్‌బ్లోయర్‌లు అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్యాలను పరిరక్షించే రీతిలో వ్యవహరించాలి. స్నోడెన్ విషయంలో అలా జరగలేదు’ అని ప్రెస్ సెక్రెటరి జోష్ ఎర్నెస్ట్ అన్నారు. ‘ఎడ్వర్డ్ స్నోడెన్ విజిల్‌బ్లోయర్ కాదు’ అని ఆయన పేర్కొన్నారు.