అంతర్జాతీయం

పుణెలో ట్రంప్ టవర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో సహా వివిధ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే విదేశాంగ విధానంపై ప్రభావం చూపించవచ్చని ఒక నివేదిక పేర్కొంది.
మన దేశంలోని పూణె, గురగావ్‌లాంటి నగరాల్లో ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టా రు. ఒకవేళ నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆయన గెలిస్తే విదేశాల్లోని తన పెట్టుబడులు కచ్చితంగా దేశ విధాన నిర్ణయాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని న్యూస్‌వీక్ పత్రిక ఒక నివేదికను ప్రకటించింది. ‘‘ ఆయన భారత్ పట్ల కఠినంగా వ్యవహరిస్తే, పైప్‌లైన్ ప్రాజెక్టులకు మార్గం సుగమం అవటంతో పాటు, పూణె భాగస్వాములపై విచారణను నిలిపివేయటం జరుగుతుందా? ఒకవేళ పాకిస్తాన్ పట్ల కటువుగా వ్యవహరిస్తే అది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల కోసమా? లేక పూణెలో ట్రంప్ టవర్లను కాపాడుకోవటానికి భారత అధికారులను మచ్చిక చేసుకోవటానికా’’ అని న్యూస్ వీక్ పేర్కొంది. భారత్‌లోని కాంగ్రెస్, బిజెపీలకు చెందిన చాలా మంది నేతలతో ట్రంప్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా వివరించింది. ట్రంప్ అధ్యక్షుడైతే ట్రంప్ సంస్థల ప్రయోజనాలు, అమెరికా విదేశాంగ విధానం మధ్య ఘర్షణ పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది. భారత రియల్టర్ రోహన్ లైఫ్‌స్కేప్స్ తో ట్రంప్ 2011లో ఒప్పందం కుదుర్చుకున్నారని 65 అంతస్థుల భవంతి నిర్మించాలని వారు భావించారని, అయితే ప్రభుత్వ క్రమబద్దీకరణ అడ్డంకులు ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారాయని వివరించింది. మహారాష్టల్రో అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌తో మాట్లాడేందుకు జూనియర్ ట్రంప్ ముంబైకి వెళ్లారని కూడా ఈ పత్రిక రాసింది. పూణెలోని ట్రంప్ టవర్స్‌కు సంబంధించిన స్కాం గత నెలలోనే బయటపడిందని, స్థానిక ప్రభుత్వం, పోలీసులు భూరికార్డులను పరిశీలిస్తున్నారని, పంచ్‌శీల్‌లో నిర్మిస్తున్న భవనం నిర్మిస్తున్న భూమి చట్టబద్దంగా సొంతం చేసుకున్నది కాదని అభియోగాలు వచ్చాయని, పూణెలోని భారత్ కంపెనీ ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని చెప్తున్నప్పటికీ, అధికారులు మరోవిధంగా కేసుకు ముగింపునిస్తే, దాని ప్రభావం ట్రంప్‌పై పడుతుందని న్యూస్‌వీక్ స్పష్టం చేసింది.