అంతర్జాతీయం

అంగారకుడికిపై క్వార్ట్జ్ నిక్షేపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 18: ఈ భూమి మీద క్వార్ట్జ్‌గా పేర్కొనే సీలికా నిక్షేపాలు అంగారక గ్రహ ఉపరితలంపై అపారంగా ఉన్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన క్యూరియోసిటీ రోవర్ అందించిన వివరాలను బట్టి తెలుస్తోంది. శిలలు ఏర్పడడానికి ఉపయోగపడే ఓ రసాయన పదార్థమే సిలికా. దీని నిక్షేపాలు అంగారక గ్రహంపై కనిపించడంతో ఈ గ్రహప్రాచీన వాతావరణం గురించి మరింతగా అధ్యయనం చేసే అవకాశం శాస్తవ్రేత్తలకు కలిగింది. గత ఏడు నెలలుగా అంగాకర గ్రహాన్ని అనేక కోణాల్లో శోధిస్తున్న క్యూరియోసిటీ రోవర్ ఈ గ్రహంలోని కొన్ని ప్రాంతాల్లో సిలికా నిక్షేపాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు గుర్తించింది. 40 నెలల క్రితం క్యూరియోసిటీ రోవర్‌ను అంగారక గ్రహంలోకి నాసా ప్రవేశపెట్టింది. కొన్ని శిలల్లో పదింట తొమ్మిదింతల మేర సిలికా ఉంటుంది. సిలికాన్ ఆక్సిజన్ మిశ్రంగా ఇది శిలల ఏర్పాటుకు దోహదం చేస్తుంది. ఓ క్వార్జ్‌లోనే కాకుండా ఇతర అనేక ఖనిజాల్లో కూడా సిలికా అత్యధిక పరిమాణంలో ఉంటుంది. అంగారక గ్రహంపై అత్యంత ఎత్తయిన ప్రాంతమైన వౌంట్ షార్ట్ భౌగోళిక పొరలను గత కొంత కాలంగా ఈ రోవర్ అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ పర్వతం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి నాసాకు పంపింది. తొలి ఏడాదిలోనే పంపిన చాయా చిత్రాలు అంగారక గ్రహ ఉపరితలంపై మిలియన్ల కొద్దీ సంవత్సరాల క్రితం నీరు ప్రవహించేదన్న సంకేతాలు ఉండేవన్న సంకేతాలు పంపింది. ఈ గ్రహ వాతావరణం ఓ దశలో జీవరాశి మనుగడకు అనుకూలంగా ఉండేదన్న వాదనకు బలం చేకూరింది.