అంతర్జాతీయం

కాశ్మీర్ తేలితేనే శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 21: కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్- పాక్‌ల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొనే అవకాశమే లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో బుధవారం మాట్లాడిన షరీఫ్ భారత్‌తో సత్సంబంధాలను పాదుగొల్పేందుకు తాము చేస్తున్న కృషిని వివరించారు. అన్ని వివాదాస్పద అంశాలనూ శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రతిపాదిస్తూ తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని వివరించారు. కానీ భారత్ మాత్రం ఎప్పటికప్పుడు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాని డిమాండ్లనే తెరపైకి తెస్తూ వచ్చిందని తెలిపారు. శాంతి చర్చలు జరపడం వల్ల పాకిస్తాన్‌కు ప్రయోజనం కలిగించడం కాదని, ఇవి ఇరు దేశాల ప్రయోజనాలకూ ఎంతో కీలకమని నవాజ్ ఉద్ఘాటించారు. విదేశీ ఉగ్రవాదాన్ని తాము ఎంత మాత్రం సహించమని, దేశంలో కల్లోలం సృష్టించేందుకు అస్థిర పరిచే కుట్రలనూ తిప్పికొడతామని తెలిపారు. అన్యాయం తీవ్రంగా ఉన్నప్పుడు శాంతియుత సంబంధాలను పెంపొందించుకోవడం ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాదనను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో జరుగుతున్న మారణకాండపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. వారాల తరబడి అక్కడ అమలు అవుతున్న కర్ఫ్యూను ఎత్తివేయాలన్నారు. కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని తాము పూర్తిగా బలపరుస్తున్నామన్నారు. జూలై 8న భారత జవాన్ల కాల్పుల్లో మరణించిన బూర్హన్ వనీ సామాన్యుల సారథ్యంలో జరుగుతున్న కాశ్మీరీ ఉద్యమానికి ప్రతీకగా మారారని నవాజ్ అన్నారు. కాశ్మీర్‌లో లోయలో భారత దశాలు అమానుషాలకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని, వీటిపై ఐరాసకు నివేదిక అందిస్తామని చెప్పారు. కాశ్మీర్ ప్రజలే చేపట్టిన ఉద్యమాన్ని ఎంతగా అణచివేస్తే అంతగానూ ఆ రాష్ట్ర ప్రజల స్వయం నిర్ణయాధికార పోరాటం బలపడుతుందని చెప్పారు. కాశ్మీర్‌పై చేపట్టిన తీర్మానాలను అమలు చేయడానికి ఐరాస భద్రతా మండలి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
chitram...
ఐరాసలో మాట్లాడుతున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్