జాతీయ వార్తలు

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పండుగల సీజన్ ముందుండటంతో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విధంగా 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లించడం వరుసగా ఇది అయిదోసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఇక్కడ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ రైల్వేలో 2015-16 సంవత్సరానికి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పత్తితో అనుసంధానమైన బోనస్ (పిఎల్‌బి)ను డెబ్బై ఎనిమిది రోజుల వేతనానికి సమానంగా చెల్లించాలనే ప్రతిపాదనను ఆమోదించింది. ప్రతి సంవత్సరం దసరా పండుగకు ముందు సుమారు పనె్నండు లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఈ బోనస్‌ను అందుకుంటారు. ఈ బోనస్ చెల్లింపు వల్ల భారతీయ రైల్వేలపై సుమారు రూ.2090.96 కోట్ల ఆర్థిక భారం పడుతుంది.

‘పాకిస్తాన్ జిందాబాద్’
అన్న వారిపై రాజద్రోహం కేసు
మొరాదాబాద్, సెప్టెంబర్ 28: ఉత్తరప్రదేశ్‌లో అనూహ్యమైన సంఘటన కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఉరీ ఉగ్రవాద దాడి ఘటనలో అమరులైన వీర జవాన్లకు నివాళిగా మంగళవారం మొరాదాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ వీడియో రికార్డింగ్ కూడా కావటంతో దాదాపు 200మంది కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు రాజద్రోహం కేసును నమోదు చేశారు. మొరాదాబాద్‌లో కాశీపూర్ రోడ్డు నుంచి ఎస్‌డిఎం కార్యాలయం దాకా కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లుగా దైనిక్ జాగరణ్ పత్రిక పేర్కొంది.

ర్యాలీ వీడియో ఫుటేజి కూడా లభ్యం కావటంతో పోలీసులు కేసు పెట్టారు.