అంతర్జాతీయం

అత్యాధునిక డ్రోన్‌ల కొనుగోలుకు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 22: చైనా సైన్యాలు పదేపదే మన భూభాగంలోకి చొచ్చుకు రావడం లాంటి సంఘటనల దృష్ట్యా మన దేశం తన ఆయుధ సంపత్తిని పెంచుకునే ఉద్దేశంతో అమెరికానుంచి సుమారు 200 కోట్ల డాలర్ల విలువైన దాదాపు వంద మానవ రహిత డ్రోన్‌లను కొనుగోలు చేయాలని అనుకుంటోంది. ఈ డ్రోన్‌లలో అటు నిఘాకోసం ఉపయోగపడేవే కాక, దాడులు జరపగలిగేవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా దాడులకోసం ఉపయోగించే అత్యాధునిక అవెంజర్ డ్రోన్‌లను భారత్ కోరినట్లు ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల గురించి, అలాగే మన దేశం ఆసక్తి గురించి బాగా తెలిసిన రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా చైనాను దృష్టిలో పెట్టుకునే భారత్ రిమోట్‌తో నడిచే ఈ విమానాలను కోరినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. అంతర్గత భద్రత, ఉగ్రవాద దాడుల ముప్పులాంటి వాటిలో ఉపయోగపడే ప్రధానంగా గస్తీ వెర్షన్ అయిన ‘ప్రెడేటర్ ఎక్స్‌పి’ రకం డ్రోన్‌లను కూడా మన దేశం కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు 200 కోట్ల డాలర్ల విలువైన సుమారు వంద డ్రోన్‌లు కావాలని భారత్ కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి.