అంతర్జాతీయం

‘పారిస్’కు భారత్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 2:పర్యావరణ మార్పుల నిరోధానికి సంబంధించిన చారిత్రక పారిస్ ఒప్పందాన్ని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత్ ఆదివారం ఆమోదించింది.
ఈ ఒడంబడికను ధృవీకరిస్తూ రాష్టప్రతి ప్రణబ్ ము ఖర్జీ సంతకం చేసిన కాపీని ఐక్యరాజ్య సమితి ఒప్పందాల విభాగం అధినేత శాంటియాగో విలాల్ పండోకు భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అందించారు. భారత్ ధృవీకరణతో డిసెంబర్ చివ రి నాటికి ఈ ఒప్పందం అమలు అయ్యేందుకు మరింతగా మార్గం సుగమమైంది. పర్యావరణ మా ర్పుల నిరోధక ప్రయత్నానికి భారత్ సారథ్యం వహించడం హర్షణీయమని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి రోజునే భారత్ ఈ నిర్ణ యం తీసుకోవడాన్ని మించిన నివాళి మరొకటి ఉండదని అన్నారు. మహాత్ముడి జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పా టిస్తున్న సందర్భంగా మాట్లాడిన బాన్‌కీ మూన్ భారత్ నిర్ణయంతో పారిస్ ఒప్పందం మరింత పుంజుకుంటుదన్నారు. మిగతా దేశాలు కూడా ఇంకెలాంటి జాప్యం లేకుం డా పారిస్ ఒప్పందాన్ని ధృవీకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే అన్ని కార్యకలాపాల్లోనూ అహింసాయుత రీతిలోనే ముందుకెళ్లాలనీ బాన్‌కీ మూ న్ స్పష్టం చేశారు.పారిస్ ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక భూమిక పోషించిన భారత్ మహాత్ముడి జయంతి రోజునే దాన్ని ధృవీకరించడం ఓ స్ఫూర్తిదాయక సందర్భమని అన్నారు.