అంతర్జాతీయం

గుండె పగిలిన నేపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత భయానక రీతిలో నేపాల్‌ను పెను భూకంపం కుదిపేసింది. ఖాట్మండు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లోని భవనాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు నేలమట్టమయ్యాయి. వందలాదిగా ప్రాణనష్టం జరిగింది. నెలల తరబడి ప్రజలు దిక్కూమొక్కూలేని స్థితిలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా అనేక దేశాలు నేపాల్‌కు చేయూతను అందించాయి. అన్ని విధాలుగా ఆ దేశాన్ని ఆదుకున్నాయి.
రాజకీయ పార్టీల చారిత్రక ఒప్పందం
ఏళ్ల తరబడి కొనసాగిన సంక్షోభానికి తెరదించుతూ నేపాల్ రాజకీయ పార్టీలు చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ కొత్త రాజ్యాంగం అమలు శైశవ దశలోనే ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం నేపాల్ అభివృద్ధికి ఆశావహ సంకేతాలు అందించింది. అయితే దేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగా విభజించాలన్న దానిపై విభేదాలు కొనసాగుతున్నా అంతర్గత చర్యల ద్వారా పరిష్కరించుకోగలమన్న ధీమాను నేపాల్ రాజకీయ నాయకత్వం వ్యక్తం చేస్తోంది. మధేశీలకు సంబంధించి తలెత్తిన వివాదం భారత్, నేపాల్ మధ్య సరికొత్త ఉద్రిక్తతలకు దారితీసింది.