జాతీయ వార్తలు

సార్క్‌పై భారత్ పట్టును ఛేదించడమెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 12: దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)పై భారత ప్రభావాన్ని నిలువరించేందుకు పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చైనా, ఇరాన్‌తో పాటు పొరుగున వున్న మధ్య ఆసియా రిపబ్లిక్‌లను కూడా కలుపుకుని విస్తృత స్థాయిలో దక్షిణాసియా ఆర్థిక కూటమిని ఏర్పాటుచేసే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఎనిమిది దేశాల సార్క్ కూటమిపై భారతదేశ పట్టు ఇటీవలి కాలంలో మరింత పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ దిశగా తన ఆలోచనలకు పదును పెడుతోందని బుధవారం నాడు వెలువడిన కథనాలు బట్టి స్పష్టమవుతోంది. గత వారంలో ఐదురోజుల పాటు వాషింగ్టన్‌లో పర్యటించిన పాకిస్తాన్ పార్లమెంటరీ ప్రతినిధుల బృందం దక్షిణాసియా ఆర్థిక మండలి ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చింది.
ఇప్పటికే ఈ రకమైన మండలి ఏర్పాటు మొగ్గు తొడిగిందని, క్రమంగా బలోపేతం అవుతోందని పాకిస్తాన్ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్‌ను ఉటంకిస్తూ ఈ కథనం వెలువడింది. దక్షిణాసియాను మధ్య ఆసియాతో సంధానం చేయడానికి చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా చేపడుతున్న కారిడార్ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అలాగే, గ్వాదర్ రేవు కూడా ఇటు చైనాకు, అటు అనేక మధ్య ఆసియా దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. అయితే, ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలని భారత్‌ను కూడా తాము ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌ను ఏకాకిని చేయడానికి భారత్ అనేక కోణాల్లో ప్రయత్నించింది.
దాదాపు సభ్య దేశాలన్నీ బహిష్కరించడంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు రద్దయింది. ఈ నేపథ్యంలోనే సార్క్ దేశాలపై భారత్ ప్రభావాన్ని దెబ్బతీసేందుకు దక్షిణాసియా ఆర్థిక కూటమి ఏర్పాటుపై పాక్ దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు.