జాతీయ వార్తలు

'భారత్ మాటలకు, చేతలకు పొంతన లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 15: పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దులను 2018 డిసెంబర్ నాటికి పూర్తిగా మూసివేయాలన్న భారత్ చర్య ఇరుగు పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్టు ఆ దేశం చేసిన వాదనకు విరుద్ధంగా ఉందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్‌తో ఉన్న 3,323 కిలో మీటర్ల పొడవు సరిహద్దును పూర్తిగా మూసివేస్తామని భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల మొదట్లో చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, ఆ ప్రకటన భారత్ ఇరుగు పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవడానికి కృషి చేస్తున్నట్టు చెబుతున్న వాదనకు పూర్తి భిన్నంగా ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా అన్నారు. అయితే భారత్ తాను తీసుకున్న చర్య గురించి పాకిస్తాన్‌కు ఇప్పటివరకు అధికారికంగా తెలియజేయలేదని ఆయన వెల్లడించారు.

అశాంతికి మూలం కాశ్మీరే
ఉపఖండంలో అశాంతికి కాశ్మీర్ వివాదమే ప్రధాన కారణమని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న దృఢచిత్తాన్ని భారత్ ప్రదర్శిస్తే ఆ దేశంతో చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన శనివారం అజర్‌బైజాన్‌లోని బకులో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. భారత్‌తో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చలు జరపడానికి పాకిస్తాన్ చాలాసార్లు సంసిద్ధత వ్యక్తం చేసిందని, అయితే భారత్‌నుంచే తగిన స్పందన రావడం లేదని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ వివాదం పరిష్కారానికి భారత్ ముందుకు రావాలని, ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని షరీఫ్ అన్నట్టు పాకిస్తాన్ అధికార వార్తాసంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్’ తెలిపింది. ఉరీలోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు భారత్ చేసిన ఆరోపణను షరీఫ్ తోసిపుచ్చారు.