అంతర్జాతీయం

భారత్-పాక్ శాంతి బావుటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదాన్ని పరోక్షంగా బలపరుస్తూ భారత్‌లో అశాంతికి ఆజ్యం పోసిన పాకిస్తాన్ శాంతి చర్చలకు సంసిద్ధమైంది. కాశ్మీర్ సహా అనేక అంశాలను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ ఉగ్రవాదాన్ని అజెండా పెట్టుకున్న పాక్ నాయకత్వం శాంతి ప్రాధాన్యతను గుర్తించింది. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం కుదిరింది. గతంలో కుదిరిన ఉమ్మడి చర్చల ప్రక్రియ స్థానే సమగ్ర చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య బ్యాంకాక్‌లో జరిగిన సమావేశం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. అంతకు ముందు అనేక సార్లు భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య జరిగిన చర్చలు కూడా ఈ శాంతి చర్చల శకానికి ఊతాన్నిచ్చాయి.
ప్రతి సంవత్సరానికి చరిత్ర గతిలో ఓ ప్రాధాన్యత ఉంటుంది. 2015 సంవత్సరం అంతర్జాతీయంగా రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఎన్నో పరిణామాలను ఆవిష్కరించింది. అలాగే దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాలకు తెరదించి సామరస్య వాతావరణాన్ని ఆవిష్కరించింది. శరణార్ధుల సమస్య అనేక దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నేపాల్‌లో సంక్షోభం సమస్య కొత్త రాజధాని ఆవిష్కరణకు మార్గం సుగమం చేసింది. అన్నింటికంటే అత్యంత కీలకమైన పరిణామం మైన్మార్ ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ సారధ్యంలోని ఎన్‌ఎల్‌డి ఘన విజయం సాధించడం. అమెరికా, ఇరాన్‌ల మధ్య అణుసహకారం పెంపొందడం ఓ కీలక పరిణామం. సిరియా యుద్ధం, క్రిమియాపై రష్యా దాడి, పారిస్‌పై ఉగ్రవాద పంజా, దక్షిణ చైనాలో ఉద్రిక్తతలు ప్రపంచ పరిణామాలపై ప్రభావాన్ని చూపాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్న వాతావరణ మార్పుల నిరోధంపై ప్రపంచ దేశాలన్నీ ఓ అంగీకారానికి రావడం పుడమి పచ్చదనానికి నిండుతనాన్ని చేకూర్చే పరిణామం. ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్ల ఘాతుకాలు మరింతగా పెచ్చరిల్లాయి. పారిస్‌లోని చార్లీహెబ్డో అనే పత్రికపై దాడి చేసి ఒక కార్టూనిస్టును హతమార్చిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా కల్లోలాన్ని రేపింది. 117 మంది ప్రయాణికులతో రష్యాకు చెందిన ఓ విమానం ఈజిప్టులో కుప్పకూలిపోయిన ఘటనతో పాటు అనేక రకాలుగా ఘోర ప్రమాదాలకు ఈ సంవత్సరం కేంద్రంగా మారింది.