అంతర్జాతీయం

భారత్ వైపు... ప్రపంచ దేశాల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన విదేశీ పర్యటనలు భారత్‌తో అనేక దేశాలకు సన్నిహిత సంబంధాలను పాదుగొల్పడమే కాకుండా వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ఊతాన్నిచ్చాయి. ముందుగా పొరుగు దేశాలతో పర్యటనలకు శ్రీకారం చుట్టిన మోదీ అమెరికా, యుకె, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ, కెనడా, చైనా, ఐర్లాండ్ తదితర దేశాల్లో విస్తృతంగానే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాంతీయంగానూ అంతర్జాతీయంగానూ వాదనను బలంగానే వినిపించారు. అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవన్నీ అతి తక్కువ వ్యవధిలోనే భారత్‌లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టడానికి అనేక విధాలుగా సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోడానికి దోహదం చేశాయి. 2015లో అమెరికా సహా అనేక దేశాలతో భారత్ అత్యంత అరుదైన మైత్రి బంధాన్ని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన విదేశీ పర్యటనలు అనేక దేశాలతో భారత్ సాన్నిహిత్యాన్ని పెంపొందించాయి. ధనిక, పేద అన్న తేడాలేకుండా అన్ని దేశాలూ తమకు సమానమేనన్న భావనను మోదీ ఆవిష్కరించారు. ఇంత తక్కువ కాలంలో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై కేంద్రీకృతం కావడం సరికొత్త ఆశలను రేకెత్తించింది.
ముఖ్యంగా నిరంతరం కయ్యానికి దిగే పాకిస్తాన్‌తో శాంతి చర్చలకు బలమైన బాటలు పడ్డాయి. రెండు దేశాలు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.