అంతర్జాతీయం

ట్రంప్‌కు అగ్నిపరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ప్రాన్సిస్కో, ఫిబ్రవరి 8: ఏడు ముస్లిం దేశాలపై విధించిన వివాదాస్పద నిషేధంలో ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో అగ్నిపరీక్షే ఎదురవుతోంది. అప్పీళ్ల కోర్టుకు చెందిన న్యాయమూర్తులు ఈ నిషేధం విషయంలో ట్రంప్ ప్రభుత్వాన్ని పదునైన పదజాలంతో నిలదీశారు. ఈ నిషేధాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారు? ఇది ముస్లింల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వివక్ష కనబర్చడమేనా? అంటూ ప్రశ్నించారు. అలాగే జాతీయ భద్రతావసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిషేధాన్ని విధించినట్టుగా ట్రంప్ ప్రభుత్వం చేసిన వాదనను కూడా భిన్న కోణాల్లో ప్రశ్నించారు. అయితే ఈ వివాదాస్పద ఆదేశాన్ని అమెరికా జస్టిస్ విభాగంగా గట్టిగా సమర్థించుకుంది. ఈ ఏడు దేశాలకు చెందిన ముస్లింల వలసలపై నిషేధం విధించడమన్నది దేశాధ్యక్షుడిగా ట్రంప్‌కున్న రాజ్యాంగబద్ధమైన అధికారమని, దేశావసరాలను కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టం చేసింది. ఈ నిషేధంపై విధించిన స్టేని ఎత్తివేయాలని, దాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. దాదాపు గంటకుపైగా టెలీఫోన్‌లోనే తొమ్మిదో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ఈ విచారణ జరిపింది. దేశంలోకి వచ్చే వలసలను, అదేవిధంగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడు ట్రంప్ సమతూకంతోనే వ్యవహరించారని జస్టిస్ విభాగం న్యాయవాది అగస్ట్ ఫ్లెంజీ కోర్టుకు స్పష్టం చేశారు. అయినప్పటికీ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం వ్యవహారం దెబ్బతిందని వ్యాఖ్యానించారు. ఈ వాదనలను అనేక టెలివిజన్ చానెళ్లు ప్రసారం చేశాయి. ట్రంప్ ఆదేశంపై సిటిల్ కోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని శాన్‌ప్రాన్సిస్కో కోర్టును ఆయన కోరారు. జిల్లా న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం దేశాధ్యక్షుడు జాతీయ భద్రతా పరిరక్షణ నిర్ణయానే్న సవాల్ చేసేదిగా ఉందన్నారు. అలాగే, ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు వేసిన వివిధ రాష్ట్రాల అటార్నీలను కూడా అప్పీళ్ల కోర్టుల న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఏవిధంగా ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావిస్తారు?, ముస్లింలకు వ్యతిరేకమని పరిగణిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక మతానికి చెందిన వారిని రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిషేధం విధించారని చెప్పడానికి మీవద్దనున్న ఆధారాలు ఏమిటని వాషింగ్టన్, మినె్నసోటా రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అటార్నీని న్యాయమూర్తి రిచర్డ్ క్లిఫ్టన్ ప్రశ్నించారు. ప్రపంచంలో మొత్తం 15శాతం మంది ముస్లింలకు మాత్రమే ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది కలుగుతున్నపుడు, మొత్తం మెజార్టీ ముస్లింలే నష్టపోతున్నారంటూ ట్రంప్ ఆదేశాలను ఏవిధంగా అన్వయిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.