అంతర్జాతీయం

మన బంధం గట్టిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, డిసెంబర్ 23: రక్షణ రంగంలో రష్యా ఎప్పటికీ భారత దేశ ప్రధాన భాగస్వామిగానే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ, మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో అత్యాధునిక రక్షణ పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు తమ రెండు దేశాలు కలిసి కృషి చేస్తున్నాయని చెప్పారు. ‘దశాబ్దాలుగా రష్యా భారత దేశానికి అత్యంత ప్రధానమైన రక్షణ భాగస్వామిగా ఉంటోంది.. మా రక్షణ పరికరాల్లో అధిక భాగం ఆ దేశానివే. భారత దేశం ప్రపంచ మార్కెట్‌కు మరింత దగ్గరైన ప్రస్తుత పరిస్థితిలో సైతం రష్యా మా ప్రధాన భాగస్వామిగానే ఉంటోంది’ అని రష్యా వార్తాసంస్థ ఇటార్-టాస్‌కు ఇచ్చిన బుధవారం ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. భారత దేశం కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహహస్తం అందించడానికి కొద్ది దేశాలు మాత్రమే ముందుకు వచ్చిన సమయంలో రష్యా భారత దేశానికి రక్షణ పరికరాలను, అంతర్జాతీయ మద్దతును అందించిన విషయాన్ని మోదీ గుర్తు చేస్తూ, క్లిష్ట సమయంలో ఆదుకున్న రష్యాను భారతీయులు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర చర్చలు జరపడం కోసం మోదీ బుధవారంనుంచి రెండు రోజులు అక్కడ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాలు అణు విద్యుత్, రక్షణ రంగాలు సహా వివిధ రంగాల్లో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. భారత్, రష్యా దేశాల సంబంధాలు కొనుగోలుదారుడు, విక్రేత దశనుంచి బ్రహ్మోస్ క్షిపణి, సుఖోయ్-30 యుద్ధ విమానాలు, టి-90 ట్యాంకులులాంటి అత్యాధునిక వ్యవస్థలను సంయుక్తంగా నిర్మించుకునే స్థాయికి ఎదిగాయని ఆయన అంటూ, రక్షణ రంగంలో మేకిన్ ఇండియా కార్యక్రమంలో ఒక ప్రధాన భాగస్వామి అయ్యే శక్తి సామర్థ్యాలు రష్యాకు ఉన్నాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లో రక్షణ పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి తమ రెండు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. అంతేకాక రష్యా సహకారంతో ప్రపంచంలోనే అత్యుత్తమైన భద్రతా ప్రమాణాలు కలిగి ఉన్న 12 అణు రియాక్టర్లను నిర్మించడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. ‘అణు శక్తిని శాంతియుత అవసరాలకోసం ఉపయోగించుకోవడంలో రష్యాతో మా సహకారం మా వ్యూహాత్మక భాగస్వామ్యానికి మూలస్తంభం’ అని మోదీ అన్నారు. కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు కార్యకలాపాలను ప్రారంభించడమే కాక విస్తరిస్తూ ఉన్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని మోదీ అంటూ, కుడంకుళం తర్వాత భారత్‌లో రష్యా డిజైన్ చేసిన అణు రియాక్టర్లకోకసం రెండో స్థలాన్ని ఖరారు చేయబోతున్నామని చెప్పారు.

చిత్రం.. సైనిక వందనం స్వీకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ