అంతర్జాతీయం

ట్రంప్ టెర్రర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: దేశంలో సరయిన పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న దాదాపు కోటీ పది లక్షల మందిని పంపించి వేయడానికి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికల కారణంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న దాదాపు 3 లక్షల మంది భారత్‌కు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరయిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షలాది మందిని పంపించి వేయడానికి ట్రంప్ క్షేత్రస్థాయి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడానికి వీలుగా ఆ చట్టాల పరిధిని గణనీయంగా విస్తృతపరుస్తూ కొత్త మార్గదర్శకాలూ జారీ చేశారు. ‘దేశంనుంచి పంపించి వేయాల్సిన విదేశీయులకు చట్టంనుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు’ అని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన ఓ మెమో పేర్కొంది. ‘ఏ విదేశీయుడైనా ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నమ్మినట్లయితే అతడ్ని అరెస్టు చేసేందుకు, అదుపులోకి తీసుకునేందుకు పూర్తి అధికారాలు ఇమిగ్రేషన్ అదికారికి ఉంటాయి’అని కూడా ఆ మెమో స్పష్టం చేసింది. అక్రమ వలసదారులను దేశంనుంచి పంపించి వేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్ మెమోలను హోంలాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసింది. సరయిన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లిన వారిలో మన దేశానికి చెందిన వారు దాదాపు 3 లక్షల మంది ఉంటారని అంచనా. వేగంగా బహిష్కరించే విధంగా నిబంధనలను అమలు చేసే అధికారం హోం లాండ్ సెక్యూరిటీ విభాగం మంత్రికి ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతించని వారిని, అనుమతించదగని వ్యక్తిగా ప్రకటించడానికి ముందు రెండేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా భౌతికంగా అమెరికాలో ఉండని వారిని ఈ నిబంధన కింద దేశంనుంచి పంపించి వేయవచ్చు. అయితే చిన్న పిల్లలున్న వాళ్లు, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్లు, లేదా స్వదేశంలో హింస, నిర్బంధానికి గురవుతామని భయపడుతున్న వాళ్లు, చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ స్టేటస్ ఉన్నట్లు తెలిపే వారు ఈ చర్యలనుంచి తప్పించుకోవచ్చు.
మా తలుపులు తెరిచే ఉంటాయి: ఇయు
ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతూ ఉండడం భారతీయ ఐటి నిపుణులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ ఉంటే ఐరోపా దేశాలు భారతీయ ఐటి నిపుణులకు తలుపులు బార్లా తెరుస్తామంటూ ప్రకటిస్తూ ఉన్నాయి. మరింత ఎక్కువ మంది భారతీయ ఐటి నిపుణులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఐరోపా యూనియన్ ప్రకటించడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ రూపంలోనైనా రక్షణాత్మక ధోరణులు కొనసాగడం సరికాదని స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇయు-్భరత్ వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఇరుపక్షాలు విఫలం కావడంపై మన దేశంలో పర్యటిస్తున్న ఇయు పార్లమెంటులో విదేశీ వ్యవహారాల కమిటీ ప్రతినిధి బృందం బుధవారం విచారం వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాన్ని ఈ ప్రతినిధి బృందం నాయకుడు డేవిడ్ మెక్ అలిస్టర్ విమర్శిస్తూ, ‘ఎక్కువ డిమాండ్ ఉండే భారతీయ ఐటి నిపుణులు మరింత మందిని అనుమతించడానికి ఇయు సిద్ధంగా ఉంది. భారత దేశంనుంచి నిపుణులైన ఐటి ఉద్యోగులు లేకుండా ఉంటే మా ఐటి రంగం ఇంత విజయవంతమయి ఉండేది కాదు’ అని అన్నారు. ఇయు ప్రతినిధి బృందం పలువురు కేంద్ర మంత్రులతో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో కూడా చర్చలు జరపనుంది.