అంతర్జాతీయం

మార్పు కోసమే ప్రజలు ఓటేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 22: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.
గత అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఒబామా కేర్’ను రద్దు చేసి, దాని స్థానంలో మరో ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కూడా ట్రంప్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో మార్పు తేవాలని, తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఓట్లు వేశారని ట్రంప్ మంగళవారం తన పార్టీ సహచరులకు చెప్పారు. ‘నవంబర్ 8న అమెరికా ప్రజలు చరిత్రాత్మక మార్పు కోసం ఓటు వేశారు. దిగువ, ఎగువ సభలు, వైట్ హౌస్ తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి కూడా వారు ఓటు వేశారు. అమెరికా ప్రజలు మమ్మల్ని స్పష్టంగా ఆదేశించారు. తీరిక లేకుండా చేయవలసిన పనులు చేయడానికి ఇదే తగిన సమయం’ అని ట్రంప్ నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసనల్ కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ‘గురువారం నాటి కీలకమైన ఓటుతో చట్టపరమైన కృషి ప్రారంభమవుతుంది. విధ్వంసకరమైన ఒబామా కేర్‌ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడంలో రిపబ్లికన్ పార్టీకి, మన దేశ ప్రజలకు నిజంగా ఇది కీలక ఓటు’ అని ట్రంప్ అన్నారు. దేశంలో నెలకొన్న కొత్త వాణిజ్య వాతావరణం వల్ల అమెరికా ప్రజలు కోల్పోయిన ఉద్యోగావకాశాలు తిరిగి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. స్ప్రింట్, ఇంటెల్, ఎగ్జోన్ మొబిల్ వంటి కంపెనీలు ఈ దిశగా కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. వాల్‌మార్ట్, ఫోర్డ్, ఫియట్-క్రిస్లర్, జనరల్ మోటార్స్ కంపెనీలు కూడా అమెరికా ప్రజలకు ఉద్యోగావకాశాలు పెంపొందిస్తామని ప్రకటించాయని ఆయన పేర్కొన్నారు.