అంతర్జాతీయం

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, డిసెంబర్ 25: భారత్, అఫ్గానిస్థాన్‌ల మధ్య స్నేహ బంధం గొప్పతనాన్ని వివరించడానికి ప్రధాని నరేంధ్ర మోదీ ‘ స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అంటూ సిని మా పాట పాడారు. శుక్రవారం అఫ్గాన్ పార్లమెంటు సభ్యులనుద్దేశించిప్రసంగించిన మోదీ భారత దేశం స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అఫ్గానిస్థాన్‌ను గొప్ప స్నేహితుడిగా భావిస్తుందని చెప్పడానికి ‘జంజీర్’ హిందీ సినిమాలో షేర్‌ఖాన్ పాత్రలో ప్రాణ్ పాడిన ‘ యారీహై ఈమాన్ మేరా, యార్ మేరీ జిందగీ’ అన్న పాటను పాడారు. అఫ్గానిస్థాన్ ప్రజలకు హిందీ సినిమాలు, పాటలంటే ఎంతో క్రేజ్. అందుకే వారికి అర్థం కావడం కోసం ప్రధాని ఈ పాటను ఎంచుకున్నారు. యారీహై.. పాటను తెలుగులో నిప్పులాంటి మనిషి సినిమాలో స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అని రాసిన విషయం తెలిసిందే.
భారత్, అఫ్గానిస్థాన్‌ల మధ్య శతాబ్దాలుగా ఉన్న స్నేహబంధాన్ని తెలియజెప్పడానికి ప్రధాని తన ప్రసంగంలో ఈ పాటనే కాకుండా రవీంద్రనాథ ఠాగూర్ ‘కాబూలీవాలా’ పేరుతో రాసిన కథలోని కాబూలీవాలా పాత్రను, మహాభారతంలోని గాంధా పాత్రను కూడా గుర్తు చేసుకున్నారు. భారత్, అఫ్గాన్‌దేశాల ప్రజల మధ్య మరింత స్వేచ్ఛగా రాకపోకలు సాగి మరింతమంది కాబూలీలాలు భారత్‌కు వచ్చి భారతీయుల హృదయాలను గెలుచుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు ప్రధాని తన ప్రసంగం ప్రారంభంలో ఇరు దేశాలకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను కూడా ప్రస్తావించారు. ఇటీవల జరిగిన తొలి హోమ్ సిరీస్‌లో అఫ్గాన్ అండర్-19 క్రికెట్ జట్టు జింబాబ్వేను ఓడించినందుకు అభినందనలు తెలియజేసారు. అంతేకాదు అఫ్గాన్ క్రికెట్ జట్టు ఢిల్లీ సమీపంలోని మైదానంలో ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవుతున్నందుకు కూడా ఆయన సంతోషం వ్యక్తం చేసారు.