అంతర్జాతీయం

ఉ.కొరియాకు సైనిక శక్తిని చూపిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/సియోల్, జనవరి 10: ఉత్తర కొరియా తన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత అమెరికా ఆదివారం అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన తన బి-52 బాంబర్ యుద్ధ విమానాన్ని, ఎఫ్-16 యుద్ధ విమానాలు దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాలతో పాటుగా ఆదివారం ఉత్తర కొరియాకు దగ్గరగా గగనతల విహారం జరిపి తన సైనిక పాటవాన్ని చాటింది. ‘దక్షిణ కొరియాలోని మా మిత్రులు, అలాగే జపాన్‌లోని మా మిత్రులకు, అలాగే అమెరికన్ హోమ్‌లాండ్ రక్షణకోసం అమెరికా ఇచ్చిన హామీ ప్రదర్శన ఇది’ అని అమెరికా పసిఫిక్ కమాండ్ (పిఏసిఓఎం) కమాండర్ అడ్మిరల్ హ్యారీ బి హారిస్ అన్నారు. ఉత్తర కొరియా సరిహద్దుకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓసాన్ ఎయిర్‌బేస్ మీదుగా జరిపిన ఈ రెండు దేశాల యుద్ధ విమానాల విన్యాసం రెండు దేశాల మధ్య మైత్రి బలాన్ని, కొరియా ద్వీపకల్పం ప్రాంతంలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు తమ రెండు దేశాల కృతనిశ్చయానికి ప్రతీక అని అమెరికా పసిఫిక్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. హైడ్రోజన్ బాంబు పరీక్షను ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ సమర్థించుకున్న సమయంలోనే అమెరికా తమ సైనిక శక్తిని ప్రదర్శించడం గమనార్హం.