జాతీయ వార్తలు

అమిత్ షా ఎన్నిక ఇక లాంఛనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: బిజెపి తాత్కాలిక అధ్యక్షుడు అమిత్ షా ఈ నెలాఖరుకు పూర్తిస్థాయి అధ్యక్షుడుగా ఎన్నిక కానున్నారు. బిజెపి అధ్యక్ష పదవి చేపట్టేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిరాకరించటంతో అమిత్ షా పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావటం దాదాపుగా ఖాయమైపోయింది. రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రివర్గంలో హోంశాఖను చేపట్టటంతో అమిత్ షాను పార్టీ అధ్యక్షుడుగా నియమించటం తెలిసిందే. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో అమిత్ షాను బిజెపి అధ్యక్షుడుగా కొనసాగించడంపై పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, మురళీమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హాలు అభ్యంతరం తెలిపారు. అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను ఒప్పించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ తీవ్ర స్థాయిలో కృషి చేసింది. అయితే ఇరువురు నాయకులు కూడా మరోసారి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఖరాఖండీగా నిరాకరించటంతో ఆర్‌ఎస్‌ఎస్ అమిత్ షా అభ్యర్థిత్వాన్ని బలపరచక తప్పని పరిస్థితి ఏర్పడిందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా స్థానంలో సీనియర్ నాయకుడిని పార్టీ అధ్యక్షుడుగా నియమించటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని అదుపు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ భావించిందని అంటున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కనీసం పంతొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి కావలసి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తి కావటంతో అమిత్ షాను పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకునేందుకు రంగం సిద్దమవుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్‌షాను ఈ నెల 23 లేదా 27వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. బిజెపి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అవినాష్‌రాయ్ ఖన్నా ఒకట్రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతున్నాయి.