అంతర్జాతీయం

‘మూన్ వాకర్’ ఎడ్గర్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామి: చంద్రుడిపై నడిచిన 12 మంది వ్యోమగాముల్లో ఒకరైన అమెరికా వ్యోమగామి ఎడ్గర్ మిచెల్ మృతి చెందినట్లు నాసా, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రుడిపై కాలిడి 45 ఏళ్లు పూర్తి కావడానికి ఒక రోజు ముందు గురువారం రాత్రి పొద్దుపోయాక 85 ఏళ్ల ఎడ్గర్ ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్‌బీచ్ ఆస్పత్రిలో కన్ను మూసినట్లు నాసా తెలియజేసింది. 1971లో అమెరికా చంద్రుడిపైకి పంపిన అపోలో-14 యాత్రలో పాల్గొన్న ముగ్గురు వ్యోమగాముల్లో ఎడ్గర్ ఒకరు. మిగతా ఇద్దరు అలాన్ షెపర్డ్ జూనియర్, స్టువర్ట్ రూసా. అప్పుడు చంద్రుడిపైకి వెళ్లిన ముగ్గురిలో ఇప్పటివరకు బతికి ఉండింది ఆయన ఒక్కరే. రూసా 1994లో మృతి చెందగా, షెపర్డ్ 1998లో చనిపోయారు. అంతరిక్షంనుంచి భూమి ఎలా కనిపించిందో అప్పుడు ఎడ్గర్ అద్భుతంగా వర్ణించాడని నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ బోల్డెన్ గుర్తు చేసుకున్నారు. 1991 జనవరి 31న ప్లోరిడాలోని కేప్ కెనవరాల్‌నుంచి అపోలో 14 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. చంద్రుడిలోని ఫ్రా మారో ప్రాంతంలో దిగిన ‘అంటారెస్’ లూనార్ మాడ్యూల్‌కు ఎడ్గర్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. చంద్రుడిపైకి మనుషులను పంపిన మూడవ ప్రయోగం అది కాగా, చంద్రుడిపై నడిచిన ఆరో వ్యోమగామి మిచెల్. ఈ యాత్ర సందర్భంగా వ్యోమగాములు దాదాపు వంద పౌండ్ల (40 కిలోల) బరువుండే చంద్ర శిలల శాంపిల్స్‌ను సేకరించడమే కాకుండా పలు ప్రయోగాలు సైతం జరిపారు. 1972లో నాసానుంచి రిటైరయిన ఎడ్గర్ ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నోయేటిక్ సైనె్సస్‌లో పని చేశారు. ఆత్మకథతో పాటుగా ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు.