అంతర్జాతీయం

హెచ్-1బి వీసాల దుర్వినియోగం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ సంస్థ అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనాలకు హెచ్-1బి వీసాలపై వచ్చిన విదేశీ ఉద్యోగులను నియమించుకుందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది. ‘ఎవర్ సోర్స్ ఎనర్జీ’ అనే ఈ సంస్థ ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో సైతం స్థానం పొందింది. ఈ కంపెనీ విదేశీ వర్కర్ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేసిందని అమెరికా అటార్నీ జనరల్ లోరెట్టా లించ్‌కు రాసిన ఓ లేఖలో డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ ఆరోపించారు. అలాగే 200 మంది అమెరికా ఉద్యోగులను ఒక్కసారిగా ఎందుకు పంపించి వేయాలని నిర్ణయించారో, భవిష్యత్తులో నియమించబోయే విదేశీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వమని వారిని బలవంతపెట్టారాలాంటి పూర్తి వివరాలు తెలియజేయాలని కనెక్టికట్ రాష్ట్రం హర్ట్ఫోర్డ్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఎవర్ సోర్స్ ఎనర్జీ కంపెనీ సిఈఓకు రాసిన మరో లేఖలో ఆయన కోరారు. ‘అమెరికా కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ వర్కర్ వీసా ప్రోగ్రామ్‌ను ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో, ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్ ద్వారా అమెరికా వర్కర్లకు ఎలా హాని చేస్తున్నాయో చెప్పడానికి ఎవర్‌సోర్స్ ఓ తాజా ఉదాహరణ’ అని లించ్‌కు రాసిన లేఖలో బ్లూమెంథాల్ పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన రాసిన ఆ లేఖను శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. 2014లో ఎవర్‌సోర్స్ 200 మంది అమెరికా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తక్కువ జీతానికి వచ్చే అదే నైపుణ్యం కలిగిన హెచ్-1బి, ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసాలు కలిగిన ఉద్యోగులను నియమించుకుంది. దీనివల్ల భారతీయ ఐటి కంపెనీలయిన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఎక్కువ లబ్ధి పొందినట్లు ‘కంప్యూటర్ వరల్డ్’ అనే పత్రిక పేర్కొంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని లించ్‌కు రాసిన లేఖలో బ్లూమెంథాల్ కోరారు.