అంతర్జాతీయం

నేపాల్ మాజీ ప్రధాని కొయిరాల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు: నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. 79 ఏళ్ల కొయిరాల 2014 ఫిబ్రవరి నుంచి 2015 అక్టోబర్ వరకూ ప్రధానిగా పనిచేశారు. ఖాట్మండు శివార్లలోని మహారాజ్‌గంజ్‌లోని స్వగ్రహంలో ఆయన కన్నుమూశారు. నేపాల్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ నేపాల్ కాంగ్రెస్‌కు సుశీల్ కొయిరాలా అధ్యక్షుడిగా పనిచేశారు. కొయిరాల ఎప్పుడూ భారత్‌లో స్నేహ సంబంధాలు కోరుకునేవారు, వాటికోసం ఎంతో కృషి చేశారు. ఆయన క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి)తో అస్వస్థతకు గురైనట్టు డాక్టర్ కబీర్‌నాథ్ యోగి తెలిపారు. గతంలో ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురైన సుశీల్ కొయిరాల అమెరికాలో శస్తచ్రికిత్స చేయించుకున్నారు. న్యుమోనియా వల్ల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌సోకి తెల్లవారితే మంగళవారం అనగా రాత్రి 12.50 గంటలకు ఆయన మృతి చెందారు. ముందురోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే గడిపిన ఆయన ఆరోగ్యం ఆకస్మాత్తుగా క్షీణించింది. సుశీల్ కొయిరాల ప్రధాని పదవిని చేపట్టిన తరువాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నేపాల్ కొత్త రాజ్యాంగ రూపకల్పనకు ఆయనెంతో చొరవ తీసుకున్నారు. భారత్‌తో మైత్రికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే కొయిరాల పదవీకాలం ఆఖరి రోజుల్లో ఎంతో ఒత్తిళ్లకు లోనుకావల్సి వచ్చింది. కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాధేసీ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇది హింసాత్మకంగా మారడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా సుశీల్ కొయిరాల బంధువు గిరిజా ప్రసాద్ కొయిరాల నేపాల్ ప్రధానిగా పనిచేశారు. సుశీల్ పార్ధీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం దశరథ్ స్టూడియోలో ఉంచారు. ప్రధాని కెపి శర్మ ఓలి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు బుధవారం నిర్వహించాలని నిర్ణయించింది.

1973లో విమానం హైజాక్ కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించారు.

దివంగత సుశీల్ కొయిరాలా బ్రహ్మచారి.

సుశీల్ కొయిరాలా పార్దివ దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్